స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

సీఐడీ విజ్ఞప్తి మేరకు ఏపీ హైకోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.ఇప్పటికే ఈ కేసులో మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు విడుదలైన సంగతి తెలిసిందే.

అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సమయంలో కోర్టు రెగ్యులర్ బెయిల్ పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.ఈ క్రమంలోనే తాజాగా సీఐడీ వినతి మేరకు మరోసారి విచారణను వాయిదా వేసింది.

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులోనే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Advertisement
ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు