టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.చంద్రబాబుది అక్రమ అరెస్ట్ కాదని చెప్పారు.
ఆయన అరెస్ట్ అనివార్యమన్న మంత్రి అంబటి దీని గురించి ప్రజలు ఆలోచించాలని విన్నవించారు.
ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డ చంద్రబాబు ప్రజాధనాన్ని సొంత జేబులో వేసుకోవడానికి ప్రయత్నించారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
అందుకే ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు.వేల వందల కోట్ల రూపాయల మేర రాష్ట్ర ఖజానాకు నష్టం చేశారన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామే కాకుండా ఫైబర్ నెట్, అమరావతి రింగ్ రోడ్డు వ్యవహారమే కాకుండా అమరావతిలో అనేక అంశాలపై రూ.కోట్లను చంద్రబాబు దోచుకోనేందుకు యత్నించారని ఆరోపించారు.అరెస్టుతో చంద్రబాబుకు సానుభూతి రాదని తెలిపారు.దర్యాప్తు సంస్థలన్నీ పూర్తిస్థాయిలో విచారణ చేసిన తరువాతనే చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.