Minister Roja : రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు పొత్తులు..: మంత్రి రోజా

టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu Naidu ) వైసీపీ మంత్రి రోజా( YCP Minister Roja ) తీవ్రంగా మండిపడ్డారు.

చంద్రబాబు వలనే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు.

ఇప్పుడు కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, జనసేన పార్టీలతో చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు.అయితే రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు.

అదేవిధంగా వైఎస్ షర్మిల( YS Sharmila ) టైమ్ పాస్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.చంద్రబాబు స్క్రిప్ట్ నే షర్మిల చదువుతున్నారన్నారు.అసలు షర్మిలకు ఏం గుర్తింపు ఉందని రోజా ప్రశ్నించారు.

అలాగే ఏపీలో వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చిన తరువాతే అభివృద్ధి జరిగిందని తెలిపారు.ఈ క్రమంలోనే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ పాలన చేస్తున్నామని వెల్లడించారు.

Advertisement
ఇదేం శ్యాడిజం.. స్కూటీని ఢీ కొట్టడమే కాకుండా అమాంతం ఈడ్చుకెళ్లిన కారు..

తాజా వార్తలు