చంద్రబాబు ప్రమాణస్వీకారం ముహూర్తం ఖరారు..!!

ఈసారి ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.2019లో ఘోరంగా ఓడిపోవడంతో.ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని కీలకంగా రాణించారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలీపోకుండా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీల( Janasenaతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.

 Chandrababu Swearing In Ceremony Has Been Finalized Chandrababu, Tdp , Telugu D-TeluguStop.com

ఎంతో హోం వర్క్ చేసి అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది.అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా కీలకంగా రాణించారు.గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో కలసి అనేక సభలలో పాల్గొనడం జరిగింది.చివర ఆఖరికి ఎన్నికలలో 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాలు గెలిచి చరిత్రత్మకమైన విజయాన్ని అందుకున్నారు.2014లో గెలిచినట్లే ఈసారి అంతకంటే ఎక్కువగా అధికమైన స్థానాలతో గెలవడం జరిగింది.ఈ ఎన్నికలలో వైసీపీ పార్టీ( YCP party )కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది.

ఏపీలో తెలుగుదేశం కూటమి( Telugu Desam Alliance ) అత్యధిక స్థానాలు గెలవడం పట్ల ప్రధాని మోదీ.కూడా ఇది చరిత్రత్మకమైన విజయం అని.కొనియాడటం జరిగింది.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఈనెల 12న ఉదయం 11:27 నిమిషాలకు ప్రమాణం చేయనున్నారు.గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా ప్రమాణం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు.ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube