మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం చాలామంది హీరోలు సినిమా అంటే ప్రాణం పెడతారు సినిమా హిట్ అవ్వాలని అహర్నిశలు కష్టపడి పని చేస్తారు.కానీ ఒకసారి స్టార్డం వచ్చిన తర్వాత గతంలో వారు చేసిన కొన్ని పనులను ఇప్పుడు పక్కన పెడుతున్న సెలబ్రిటీస్ కూడా ఉన్నారు.
మరి అంతలా ఆ తమ సినిమా కోసం పాటుపడే స్టార్ సెలబ్రిటీస్ అంతా కూడా ఒకప్పుడు చేసిన పనులు వారికి ఎంతో ఇష్టమైనవి అయినప్పటికీ కూడా ఇప్పుడు చేయలేకపోతున్నారు.మరి ఆ స్టార్ హీరోలు ఎవరు వారు చేసినా ఇష్టమైన పనులు ఏంటి? ఎందుకు ఇప్పుడు చేయలేకపోతున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాఘవ లారెన్స్
లారెన్స్( Raghava Lawrence ) పేరు చెప్పగానే ఎవ్వరికైనా గుర్తొచ్చేది మాస్ స్టెప్స్.ఎన్నో సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు.
చిరంజీవి నాగార్జున అంటే హీరోల అండదండలు ఉండి తెలుగులో చాలా ఏళ్లపాటు కష్టపడి పని చేసిన లారెన్స్ ప్రస్తుతం అసలు కొరియోగ్రాఫర్ గానే పని చేయడం లేదు.తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన డాన్స్ ని పక్కన పెట్టి కేవలం హీరో గానే సినిమాలు చేస్తూ వెళ్తున్నారు రాఘవ లారెన్స్.అందుకు గల కారణం కొరియోగ్రఫీ చేస్తే వచ్చేది అడపాదడపా డబ్బులు మాత్రమే కానీ ఒక సినిమా హీరో అంటే ఆ రేంజ్ వేరు కదా.
అల్లు అర్జున్

అల్లు అర్జున్( Allu Arjun ) నటనకు ఎంత ప్రాధాన్యమిస్తాడో డాన్సులకి కూడా అంతే మక్కువ చూపిస్తాడు.అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్ కి పడిపోని అమ్మాయిలు ఉండరు.గతంలో ఆయన చేసిన అన్ని సినిమాల్లో మంచి మాస్ ఐటమ్ నెంబర్స్ ఉండేవి.
కానీ ఇప్పుడు కేవలం యాక్షన్స్ అలాగే కథపై ఫోకస్ చేస్తూ డాన్స్ ని పక్కన పెడుతున్నారు.ఆయన గతంలో చేసిన రేంజ్ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే ఇప్పుడు ఏ సినిమాలోని కనిపించడం లేదు.
అందుకు గల కారణం కచ్చితంగా డాన్స్ లు మాత్రమే సినిమాను నిలబెట్టవు.కథ, కథనము అలాగే మాస్ సన్నివేశాలు, ఎమోషన్స్ సినిమాను నిలబడతాయి కాబట్టి ఆయన వాటి మీద ఫోకస్ చేశారు.
అల్లరి నరేష్

అల్లరి నరేష్( Allari Naresh ) పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆయన చేసిన కామెడీ హీరో వేషాలు.అల్లరి అనే పేరు కూడా ఆయనకు అలాంటి ఒక హీరో పాత తోనే వచ్చింది.మరి ఇప్పుడు ఆయన అల్లరి వేషాలు వేయడం మానేశారు అంటే కామెడీ చిత్రాలు చేయడం లేదు పూర్తిస్థాయి సీరియస్ గా ఉన్న పాత్రలు చేయడానికి ఇష్టపడుతున్నారు.అందుకు గల ప్రధాన కారణం కామిడీ అనేది ముందులాగా పండటం లేదు.
పైగా ప్రతీ సినిమాలో ను కామెడీ చేయాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి.