తాడేపల్లిగూడెం “జెండా” సభలో వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు( Chandrababu ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.టీడీపీ, జనసేన ( TDP, Jana Sena )కూటమి అధికారంలోకి వస్తే వైసీపీకి సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు.
టీడీపీ.జనసేన కూటమి సూపర్ హిట్ కాంబినేషన్.
వైసీపీ ఐదేళ్ల పాలన అట్టర్ ప్లాప్ అంటూ ఎద్దేవా చేశారు.వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తాను కలిసినట్లు చంద్రబాబు తెలిపారు.
వచ్చే ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకమన్న చంద్రబాబు.రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పోరాడాలని సూచించారు.
హైదరాబాద్ కంటే మరింత అభివృద్ధి చేయాలని అమరావతి రాజధానికి ప్రణాళిక సిద్ధం చేయటం జరిగింది.
జగన్( jagan ) ముఖ్యమంత్రి అయ్యాక అరాచక పాలనతో నాశనం చేశారని విమర్శించారు.ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహస్యం చేశారు.ఎంతోమందిని అవమానించారు.
వైసీపీ వేధింపులు తట్టుకోలేక క్రికెటర్ హనుమాన్ విహారి పారిపోయే పరిస్థితి వచ్చింది.సొంత చెల్లెలు షర్మిలాని సైతం తరిమేసారని చంద్రబాబు విమర్శించారు.
జగన్ అరాచకాలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది.కుప్పం ప్రాంతానికి నీళ్ల పేరిట జగన్ నాటకాలు వేశారన్న చంద్రబాబు.
ఒక్క రోజులోనే అంతా సర్దుకొని పోయారని సెటైర్లు వేశారు.వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో తనకు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.