మిచౌంగ్ తుఫాను ప్రభావంతో శ్రీశైలం పర్యటన వాయిదా వేసుకున్న చంద్రబాబు..!!

మిచౌంగ్ తుఫాన్( Michoung typhoon ) ప్రభావం ఏపీ పై గట్టిగా ఉంది.రాష్ట్రవ్యాప్తంగా మన జిల్లాలలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.

ముఖ్యంగా కోస్తా.ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తీవ్ర తుఫాన్ గా బలపడిన మిచౌంగ్.గంటకు కొన్ని వందల కిలోమీటర్లు వేగంతో కదులుతూ ఉంది.

ప్రస్తుతానికి చెన్నైకి( Chennai ) 90 కిలోమీటర్లు, నెల్లూరుకి 170 కిలోమీటర్లు.బాపట్లకు 300 కిలోమీటర్లు మచిలీపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో.

Advertisement

కేంద్రీకృతం అయి ఉంది.నేడు రేపు కూడా కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయి అని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది.

దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో శ్రీశైలం పర్యటనను వాయిదా వేసుకున్నారు.

షెడ్యూల్ ప్రకారం మంగళవారం శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాలి.ఈ క్రమంలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి.అయితే మిచౌంగ్ తుఫాన్ ప్రభావం గట్టిగా ఉండటంతో.

శ్రీశైలం పర్యటన( Srisailam Tour ) రద్దు చేసుకున్నారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరైన తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలను సందర్శిస్తున్నారు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
రాజ్యసభకు సుహాసిని ? చంద్రబాబు వ్యూహం ఏంటి ?

మొదట తిరుమలలో శ్రీవారిని తర్వాత విజయవాడలో కనకదుర్గమ్మ, సింహాచలంలో అప్పన్ననీ దర్శించుకున్నారు.తర్వాత శ్రీశైలం మల్లన్నతో పాటు కడప దర్గా, మేరీమాత చర్చిలను కూడా.

Advertisement

చంద్రబాబు సందర్శించనున్నారు.దీంతో మిచౌంగ్ తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత శ్రీశైలం దర్శించుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తాజా వార్తలు