ఆదివారం భోగి వేడుకలలో కలిసి పాల్గొననున్న చంద్రబాబు...పవన్..!!

ఎన్నికలు దగ్గర పడే కొలది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలకి  మూడు నెలలు మాత్రమే సమయం ఉంది.

 Chandrababu Pawan To Participate In Bhogi Celebrations On Sunday , Chandrababu,-TeluguStop.com

దీంతో చాలామంది నాయకులు పార్టీలు మారుతున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ.

ఇన్చార్జిల మార్పుల పేరుతో విడుదల చేస్తున్న జాబితాలలో పేర్లు లేనివాళ్లు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారు.ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది  వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు.

వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోవడం తెలిసిందే.ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటు ఇంకా ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో( Election Manifesto )పై రెండు పార్టీలకు చెందిన నాయకులు మొన్నటి వరకు మంతనాలు జరుపుతూ వస్తున్నారు.

అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో నేడు ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ రావడం జరిగింది.

చంద్రబాబు ఇంటిలోనే పవన్( Pawan Kalyan ) కోసం డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా రావడం జరిగింది.వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై వీరు చర్చించనున్నారు. చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ భేటీ ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగకు తెలుగుదేశం జనసేన( TDP, Janasena ) పార్టీలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థుల లిస్ట్ విడుదల చేయటానికి ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా రేపు భోగి వేడుకలలో చంద్రబాబు కలిసి పాల్గొంటారని జనసేన తెలిపింది.రాజధాని గ్రామం మందడంలో “తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం” పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొంది.

అంతేకాదు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగిమంటల్లో వేస్తారని.అనంతరం ఇద్దరు నాయకులు రైతులతో మాట్లాడనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube