టీడీపీ లో ఆ మంత్రులకి టిక్కెట్లు లేనట్టేనా..??

ఏపీలో ఎన్నికలు మరో ఐదు నెలలలో మున్చుకోస్తున్నాయి.ఇప్పటికి ప్రధాన అధికార పార్టీలో నెలకొన్న కన్ఫ్యూజన్ మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు.

వైసీపీ మొదలు జనసేన కూడా టిక్కెట్ల విషయంలో 70% ఓ క్లారిటీ తో ఉన్నారని.కేవలం ప్రకటనలు చేయడమే మిగిలి ఉందని అనుకుంటున్న తరుణంలో టీడీపీ లో మాత్రం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.

వైసీపీ నుంచీ జంప్ అయ్యి వచ్చిన ఎమ్మెల్యేలు మొదలు.సొంత పార్టీ సొంత ఎమ్మెల్యేలు , కొత్తగా ఆశలు పెట్టుకున్న ఆశావాహులు ఇలా ఎంతో మంది బాబు చుట్టూ తిరుగుతున్నా సరే బాబు మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నారు.ఇదిలాఉంటే తాజాగా వినిపిస్తున్న వివరాల ప్రకారం.

చంద్రబాబు నాయుడు పార్టీలో సీనియర్ మంత్రుల్ని పక్కన పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్స్ కి పట్టిన గతిని ఊహించుకున్న బాబు ఇప్పుడు సీనియర్స్ కి టిక్కెట్లు ఇచ్చే విషయంలో సమూలమైన మార్పులు చేర్పులు చేయాలని ఫిక్స్ అయ్యారట.

Advertisement

ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్స్ ని ఎంపిక చేయాలని అనుకున్న స్థానాలలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడానికి బాబు వ్యూహాలు సిద్దం చేశారని తెలుస్తోంది.ఇదిలాఉంటే మరి సీనియర్స్ పరిస్థితి ఏమిటి అంటే.

వారికి కూడా న్యాయం జరుగుతుంది.కాని వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చే విషయంలో మాత్రం హామీలు ఇవ్వలేమని.

ఎమ్మెల్సీ లు ఇచ్చే ఆలోచన ఉన్నట్లుగా బాబు సంసిద్ధం వ్యక్తం చేశారని అంటున్నారు.అయితే బాబు టిక్కెట్లు ఇవ్వడానికి వెనకడుగు వేసే ఆ సీనియర్ మంత్రులు ఎవరు.?? వారికి ఎమ్మెల్సీ ఇస్తే తీసుకునే పరిస్థితి ఉందా.??లేదంటే బాబు పై అలకతో పక్క పార్టీల వైపు చూస్తున్నారా అనే వివరాలలోకి వెళ్తే.

గోదావరి జిల్లాల నుంచీ ఓ సీనియర్ మంత్రికి ఈ సారి తెలుగు దేశం పార్టీ తరుపున టిక్కెట్టు లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది.ఆయనకీ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని ముందు నుంచీ చూచాయిగా సూచనలు పంపుతున్నారట.అదేమంటే మీకు పార్టీ గౌరవం ఇస్తూనే ఉంది ఇప్పడు కూడా పార్టీ లో మంత్రిగా ఉన్నారు.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
తప్పుడు ప్రచారం చేస్తున్న నాగబాబుకు ఈసీ షాక్.. మెట్టుతో కొట్టినట్టు బుద్ధి చెప్పిందిగా!

ఈ సారికి సహకరించండి అంటున్నారట.దాంతో ఇప్పుడు ఆయన సైకిల్ దిగడానికి అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

Advertisement

ఇక ఇదే జాబితాలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు కూడా ఉన్నారని వారికి సైతం టిక్కెట్లు లేవనే సూచనలు వెళ్లాయని అంటున్నారు.అయితే బాబు సంక్రాంతికి విడుదల చేసే తొలి జాబితాలో కేవలం ఐదుగురు మంత్రులకి మాత్రమే స్థానం దక్కనుందని ఆ ఐదుగురు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పన్స్ అంటున్నాయి పార్టీ వర్గాలు.

అయితే మొదటి జాబితాలో కొంతమంది మంత్రులు , మరి కొందరు ఎమ్మెల్యేలకి కలిపి సీట్లని ఖరారు చేశారని త్వరలోనే ఆ లిస్టు బయటకి వస్తుందని అంటున్నారు.మరి బాబు గెలుపు గుర్రాల లిస్టు లో ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

తాజా వార్తలు