పెన్షన్ ల టెన్షన్ : ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

ఏపీలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే.దీనిపై రాజకీయంగా పెద్ద దుమారం జరుగుతోంది.

టిడిపి అనుకూల వ్యక్తిగా మొదలు పడిన మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్( Nimmagadda Ramesh ) ద్వారా చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారని దానికి కారణంగానే పెన్షన్లను లబ్ధిదారులకు వారు ఇంటి వద్దకే పంపిణీ చేయించలేని పరిస్థితి ఏర్పడిందని , దీనికి కారణం టిడిపినేనని వైసిపి తీవ్రస్థాయిలో విమర్శ చేయడమే కాకుండా , మీడియా సోషల్ మీడియా ద్వారా ఆ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది.జనాల్లోనూ ఈ విషయంలో టిడిపి పై ( TDP ) తీవ్ర ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపించబోతుండడంతో నష్ట నివారణ చర్యలకు దిగింది.వైసీపీ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా పెన్షన్ పంపిణీ( Pension Distribution ) విషయంలో అలసత్వం వహిస్తోందని,  వాలంటీర్ల ద్వారా కాకుండా అధికారుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా.

  అది పట్టించుకోవడంలేదని, పెన్షన్ల సొమ్ము కాంట్రాక్టర్లకు చెల్లించడంతోనే, పెన్షన్లు పంపిణీకి ఆలస్యం అయిందనే విషయాన్ని టిడిపి ప్రచారం చేస్తుంది .

Chandrababu Naidu Open Letter On Pensions Distribution Issue In Ap Details, Chan
Advertisement
Chandrababu Naidu Open Letter On Pensions Distribution Issue In Ap Details, Chan

ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు.పెన్షన్ దారులందరికి ఇళ్ల వద్దే నగదు ఇవ్వాలి .పెన్షన్ పంపిణీలో రెండు విధానాలు సరికావని లేఖలో పేర్కొన్నారు .పెన్షన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి కుట్రలకు,  నాటకాలకు దించాలని కోరారు.  లబ్ధిదారులందరికీ ఇళ్ల  వద్దకే పెన్షన్లు పంపిణీ చేయాలని తెలిపారు.

సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని ప్రస్తావించారు.ఆ బాధ్యతను సీఎం జగన్( CM Jagan ) సక్రమంగా నిర్వహించకుండా, దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్థలు పాలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu Naidu Open Letter On Pensions Distribution Issue In Ap Details, Chan

స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల ముందు పెన్షన్ల పంపిణీలో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.  గత ఏడాది 2022 ఏప్రిల్ ఒకటికి ముందే పింఛన్ల నిధులు బ్యాంకులు నుంచి విత్ డ్రా చేసి, ఒకటవ తేదీన పంపిణీ చేశారన్నారు.ఈ ఏడాది కూడా ముందే బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఎదురయ్యేది కాదని వివరించారు.

మార్చి 16 నుంచి మార్చి 30 మధ్య 15 రోజుల్లోనే సొంత కాంట్రాక్టర్లకు 13 వేల కోట్లు విడుదల చేశారని పెన్షన్ దారులకు ఇవ్వాల్సిన 2000 కోట్లు కూడా సొంత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానా ఖాళీ చేశారని చంద్రబాబు లేఖలు విమర్శించారు .గత ఎన్నికల సమయంలో బాబాయి హత్యను జగన్ రెడ్డి రాజకీయ లబ్ధికి వాడుకున్నాడని,  నారాసూర రక్త చరిత్ర అంటూ తనపై నిందలు వేశాడని,  నేడు పెన్షన్ల పంపిణీ విషయంలోనూ జగన్నాటకాలు ఆడుతూ పెన్షన్ దారులకు నమ్మకద్రోహం చేస్తున్నాడని విమర్శించారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ లను ఇళ్ళ వద్ద కాకుండా సచివాలయాల్లో పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి మార్చి 28న ఇచ్చిన పత్రికా ప్రకటన ఇచ్చారని, సీఎం అనుమతి లేకుండా ఇస్తే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదని ప్రశ్నించారు.టిడిపి పై నెపం నెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి , అవ్వ తాతల్ని అవస్థల పాలు చేయడం దుర్మార్గం కాదా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

  గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించడం కష్టమని,  అందరికీ ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వలేమని ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని లేఖలో చంద్రబాబు  విమర్శలు చేశారు.

తాజా వార్తలు