ఓట్లే లక్ష్యంగా బాబు పథకాలు .. వర్కవుట్ అవుతుందా ..

ఎన్నికల సమయం తరుముకొచ్చేస్తున్న సమయంలో ఓటర్లకు పథకాల రూపంలో గేలం వేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధం అయ్యాడు.అందుకో కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లో టీడీపీ పై మంచి అభిప్రాయం కలిగేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.

 Chandrababu Naidu New Schemes For Ap People-TeluguStop.com

ప్రస్తుతం ప్రవేశపెడుతున్న కొత్త పథకాలు కొత్తవేమీ కాదు గత ఎన్నికల ముందు టీడీపీ మ్యానిఫెస్టోలో ఉన్నవే.ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇలాంటి పనులు చేసి మళ్లీ ఓట్లు వేయించుకోవాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.

అయితే ఇలా ఆఖరి నెలల్లో ఇలాంటి పథకాలు ప్రవేశ పెడితే జనాలు ఓట్లేసేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

నిరుద్యోగ భృతి విషయంలోనూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు.మంత్రి మండలి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ భృతి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.నిరుద్యోగ భృతి పథకానికి ‘‘ముఖ్యమంత్రి నేస్తం’’ గా పేరు పెట్టారు.

రాష్ట్రంలో ఉన్న నిరుద్యగ యువతను ఆకట్టుకునే ఉద్దేశ్యంతోనే ఈ పథకం రూపకల్పన చేశారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

యూత్ ఎక్కువగా వీరిద్దరి వైపే మొగ్గు చూపుతోంది.అందుకే ఆ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునేందుకు నిరుద్యోగ భృతిని ఎరగా వేసాడని ప్రత్యర్థి పార్టీలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టేసింది.

ఎన్డీయే నుంచి బయటకి వచ్చిన టీడీపీ ఆ తరువాత ఎక్కువ సంక్షేమ పథకాల మీదే ఫోకస్ పెట్టింది.కేంద్రం నుంచి నిధులు వచ్చినా రాకపోయినా అనేక ఆర్ధిక భారం అయిన పథకాలను కూడా అమలు చేసేందుకు ఏ మాత్రం సంకోచించడంలేదు.ఇటీవలే అన్న క్యాంటీన్ల పేరుతో ఐదు రూపాయల భోజనాలకు కూడా శ్రీకారం చుట్టాడు.గ్రామదర్శిని ద్వారా ఇప్పటికే ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు.అంగన్ వాడీ, హోంగార్డుల వేతనాలు పెంపుదల ఇందులో భాగమే.ప్రతి వర్గాన్ని ఆకట్టుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో టీడీపీ అధినేత కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube