తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు కొంతమంది ఈ ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపాలని ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారు.ఇందుకోసమే తమ వారసులను ఆయా నియోజకవర్గాల్లో భాగస్వామ్యం చేస్తూ… షాడో ఎమ్మెల్యేలు గా వారిని తయారు చేశారు.
ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ఎలాగూ టిక్కెట్ వస్తుంది కనుక అనుభవం, అర్హత వారికి వచ్చేస్తాయని సీనియర్ నాయకులు భావించారు.పార్టీ పుట్టినప్పటి నుంచి అంకిత భావంతో పని చేస్తున్నామని… అందుకోసమేనా తమ మాట చెల్లుబాటు అయ్యి తమ వారసులకు టిక్కెట్లు దక్కుతాయని చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారని సీనియర్ నాయకులు భావించారు.

అయితే ఎన్నికల సమయంలో ఈ వారసుల టికెట్ల విషయం కొత్త వివాదానికి దారితీస్తాయని భావించిన చంద్రబాబు .తెలివిగా… వారి కదలికలపై ఎప్పటి నుంచో నిఘా పెట్టాడు.ఈ ఐదేళ్ల కాలంలో వారు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి జాబితా రూపొందించి రెడీగా ఉంచుకున్నాడు.
ప్రస్తుతం టికెట్ల కోసం వస్తున్న సీనియర్ నాయకులకు ఆ రిపోర్ట్ చూపించి టికెట్ ఏ విధంగా ఇవ్వమంటారు అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నారు.
దీంతో సదరు నేతలు ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోతున్నారట.తెలుగుదేశం లో వారసుల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రతి జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు రాజకీయ వారసులు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు.వీరంతా టికెట్ల పై బాగా ఆశలు పెట్టుకున్నారు.

అయితే వీరికి టిక్కెట్లు కేటాయిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి చెలరేగుతుందని… ఇవన్నీ పార్టీ విజయానికి అడ్డంకులుగా మారుతాయని భావించిన బాబు ఈసారి ఎన్నికలలో వారసుడు ఎంట్రీ అడ్డుకట్ట వేసినట్టు తెలుస్తోంది.ఈ విధంగానే సీనియర్ నాయకులు కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాం బాబుకి సంబంధం ఉందనే ఆరోపణలు కారణంగా టికెట్ ఇచ్చేందుకు బాబు నిరాకరించడంతో పాటు ఈ ఎన్నికల్లో కృష్ణమూర్తిని పోటీ చేయాలని ఆదేశించారు.
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వారసుడు అప్పలనాయుడు కు సీటు ఇచ్చే విషయంలో కూడా బాబు ఇదే చెప్పారట.

అంతే కాకుండా అప్పలనాయుడుకి సంబంధించిన అవినీతి అక్రమాల లిస్టు ను బయటపెట్టేసాడు.అలాగే అనంతపురం జిల్లాలో పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ ఈసారి ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయాలని ఆరాటపడుతున్నాడు.ఈ మేరకు గ్రౌండ్ లెవల్లో అంతా సిద్ధం చేసుకున్నారు.
అయితే తన తల్లి సునీతకు అసెంబ్లీ తనకు ఎంపీ టికెట్ కావాలని పరిటాల శ్రీరామ్ పట్టుబడుతున్నాడు.కానీ ఈయన కూడా అనేక సెటిల్మెంట్ తో సంబంధం ఉండటంతో… తల్లి కొడుకు ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం కల్పిస్తామని ఇద్దరిలో ఎవరి కావాలి తేల్చుకోవాలని బాబు మొహమాటం లేకుండా చెప్పేసినట్టు తెలుస్తోంది.
అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విషయంలో కూడా ఇదే చోటుచేసుకుంది ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారని… అనేక సెటిల్ మెంట్స్ తో నేరుగా సంబంధం ఉన్నాయని బాబుకు రిపోర్ట్స్ అందడంతో టికెట్ ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది సీనియర్ నాయకులు వారసులు ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా టికెట్ల కేటాయింపులో ఆచితూచి వ్యవహరించాలని బాబు డిసైడ్ అయిపోయాడు.