టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లాక్ డౌన్ కు ముందుగానే హైదరాబాదులో తన నివాసంలో ఉండిపోవడంతో ఇప్పటి వరకు ఏపీకి వచ్చే అవకాశం లేకుండా పోయింది.అయితే ఎక్కడా ఆ లోటు తెలియకుండా చంద్రబాబు నిత్యం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్నారు.
ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ జోష్ పెంచే పనిలో నిమగ్నమై ఉన్నారు.అయితే చంద్రబాబు ఏపీలో ఉండి ఉంటే ఆ పార్టీకి మరింత మైలేజ్ పెరిగే విధంగా వ్యవహరించేవారు.
ఒకవైపు కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ నిబంధనల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం అనుసరిస్తున్న వైకిరిపై ప్రజల్లో ఉన్నా అసంతృప్తి, విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో విష వాయువు లీక్ అయిన సంఘటనలో ప్రజలు మరణించడం , మద్యం దుకాణాలు పెద్ద ఎత్తున తెరవడం, ఆ విషయంలో ప్రభుత్వం అభాసుపాలవ్వడం ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం అభాసుపాలయ్యింది.
ఇదే సమయంలో చంద్రబాబు హైదరాబాద్ నుంచే జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఎక్కడా మర్చిపోకుండా సమర్ధవంతంగా వ్యవహరించారు.కానీ ప్రత్యక్షంగా చంద్రబాబు ఏపీలో ఉండి ఉంటే పార్టీకి ప్రజల్లో మరింత మైలేజ్ పెరిగేలా చంద్రబాబు చేసి ఉండేవారని, తెలుగు తమ్ముళ్లు బాధపడుతున్నారు.
ఇప్పుడు ఏపీకి వచ్చేందుకు అనుమతి కోరేందుకు చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు.ఇప్పుడు కాకపోయినా మరో రెండు రోజుల్లో అయినా ఆయనకు అనుమతి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
చంద్రబాబు రాష్ట్రానికి వచ్చీ రావడంతోనే విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు ప్లాన్ చేసుకున్నారు.

ఆ తరువాత ఒక్కో సమస్యపైనా ప్రభుత్వంపై పోరాడేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారు.అయితే గతంలోనే చంద్రబాబు ఏపీకి వచ్చేందుకు కేంద్రం అనుమతి కోరుతూ లేఖ రాశారు తప్ప, ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ లేఖ రాయలేదు.ఆ విషయంలో బాబు అభాసుపాలవ్వడంతో ఇప్పుడు నేరుగా ఏపీ డీజీపీకి అనుమతి కోరుతూ లేఖ రాశారు.
ఇదే పని అప్పుడే చేసి ఉంటే ఈ పాటికి చంద్రబాబు ఏపీలో ఉండి ఉండేవారని, బాబు హైదరాబాద్ లో ఉండిపోవడంతో పార్టీకి అంత స్థాయిలో మైలేజ్ దక్కలేదని తెలుగు తమ్ముళ్లు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.