టీడీపీ ఒకప్పుడు ఎంత వెలుగు వెలిగిందో అందిరికీ తెలిసిందే.మూడుసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఈ రోజు ఎంత దారుణంగా తయారయిందో చూస్తున్నాం.
నిజానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఉన్న అనుభవానికి పార్టీ ఈ స్థితిలో ఉండకూడదు.పైగా చంద్రబాబుకు రాజకీయ చాణక్యుడు అనే బిరుదు కూడా ఉంది.
కానీ పరిస్థితి మాత్రం ఇలా తయారయింది.దీనంతటికీ కారణం చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలనే అని తమ్ముళ్లు ఇప్పటికే ఆరోపిస్తున్నారు.
ఇలాంటి సమయంలో చంద్రబాబు తీసుకుంటున్న మరో నిర్ణయం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
అదేంటంటే చంద్రబాబు ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ చార్జులను నియమించే పనిలో పడ్డారు.
ఈ క్రమంలోనే పార్టీ కోసం శ్రమించి పనిచేస్తున్న వారిని కాదని కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.ఉత్తరాంధ్రా జిల్లా అయిన విజయనగరం లోని సాలూరు పార్టీ ఇన్ చార్జిగా సంధ్యారాణీని నియమించారు.
ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భంజ్ దేవ్ ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నారు.అలాంటిది ఆయన్ను పక్కన పెట్టేశారు.
దాంతో పాటు విశాఖపట్నంలోని మాడుగుల ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుని కాదని పీవీజీ కుమార్ ను నియమించారు.

ఇలా పార్టీ కోసం కష్టపడుతున్న మాజీ ఎమ్మెల్యేలను కాదని కొత్త వారికి అవకాశాలు ఇవ్వడంతో ఆ పాత వర్గం కాస్తా సీరియస్‌గా ఉంటోంది.దశాబ్ద కాలానికి పైగా ఈ మాజీలు పార్టీ కోసం పనిచేస్తున్నారు.అలాంటి వారిని కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడం వల్ల పాత వారికి, కొత్త వారికి వర్గ పోరు నడుస్తోంది.
అంటే పరిస్థితి ఇంకా దిగాజారిపోతోంది.ఇది వైసీపీకి అనుకూలంగా మారుతోంది.
బాబు వర్గ పోరు ఉండొద్దని అనుకుంటూనే ఇలా వర్గపోరును పెట్టేస్తున్నారు.దీంతో పార్టీలో చీలికలు వచ్చి వర్గాలుగా తమ్ముళ్లు విడిపోతున్నారు.
.