శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణాలు సభకు తెలియపరిచారు .నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పినట్లే బయటనుంచి కొనుగోళ్ళు చేసి మరి ఇస్తున్నామని తెలిపారు.విద్యుత్ కొనుగోళ్ళు పెనుభారం ఒకెత్తుకాగా కరెంటు కట్ లేకుండా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని బాబు తెలిపారు.2015-2016లో మరి చార్జీలు పెంచబోమని తెలిపారు.ఇప్పుడు పెంచిన చార్జీలు కూడా కేవలం 14శాతం మందికి మాత్రమే పెంపు వర్తిస్తుంది .86 శాతం మందికి ఎలాంటి ఇబ్బంది ఉండనే ఉండదు అని బాబు విడమర్చి చెప్పారు .అయితే విద్యుత్ చౌర్యాన్ని మాత్రం ఎంతమాత్రం భరించలేమని అరికడతామని తెలిపారు .