హోరా హోరీ పోరు

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి.నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ పోటీ చేస్తుండగా ఆయనకు పోటీగా తాజాగా జయసుధ రంగంలోకి దిగింది.

 Tough Competition Between Rajendra Prasad And Jayasudha-TeluguStop.com

ఈ ఇద్దరు కూడా హోరా హోరీగా తలపడేందుకు సిద్దం అవుతున్నారు.తమ మద్దతుదారులతో భేటీ అవుతూ, ప్రెస్‌మీట్‌లు పెడతూ గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు.

రాజకీయ ఎన్నికలను తలపిస్తున్న మా ఎన్నికల్లో కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు.రాజేంద్రప్రసాద్‌కు మెగా ఫ్యామిలీ సపోర్ట్‌ ఇస్తుండగా, జయసుధకు మంచు ఫ్యామిలీతో పాటు మురళిమోహన్‌, కృష్ణంరాజు ఇంకా పలువురు మద్దతు తెలుపుతున్నారు.

ఇండస్ట్రీలో స్నేహశీలిగా పేరున్న రాజేంద్ర ప్రసాద్‌కు ఇప్పటికే పలువురు నటీనటులు మద్దతు తెలిపారు.అయితే ఇప్పటికే అధ్యక్షుడు అయిన మురళిమోహన్‌ మద్దతుతో జయసుధ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది.

మా అధ్యక్ష ఎన్నికల్లో గతంలో ఎప్పుడు లేనంత పోటీ ఈసారి నెలకొనడంతో ప్రలోభాలు కూడా పెడుతున్నట్లుగా తెలుస్తోంది.బెదిరింపులకు కూడా దిగుతున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి ఈ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయని నటీనటులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube