మల్టీస్టారర్‌ నుండి తప్పుకుందా?

బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకు పోతుంది ముద్దుగుమ్మ శృతిహాసన్‌.తెలుగులో ప్రస్తుతం మహేష్‌బాబుతో ‘శ్రీమంతుడు’ అనే సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు ఆ మద్య నాగార్జున మరియు కార్తీలు హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

 Shruti Hassan Out From Nagarjuna Multi Starrer Movie-TeluguStop.com

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మాణంలో ఇటీవలే ప్రారంభం అయిన ఈ సినిమా నుండి తాజాగా శృతిహాసన్‌ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఈమె నటిస్తున్న ‘శ్రీమంతుడు’ షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో ఈ మల్టీస్టారర్‌ మూవీని వదులుకోవాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ముందుగా అనుకున్న దాని ప్రకారం ‘శ్రీమంతుడు’ సినిమా ఏప్రిల్‌లో పూర్తి కావాల్సి ఉంది.కాని షూటింగ్‌ మే చివరి వరకు కూడా పూర్తి అయ్యే అవకాశాలు లేవు.

దాంతో నాగార్జున మల్టీస్టారర్‌ మూవీని శృతిహాసన్‌ వదులుకుంది.ప్రస్తుతం ఆ సినిమా దర్శకుడు మరో హీరోయిన్‌ను వెదికే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది.

మరో వైపు ఈమె ఇప్పటికే తమిళ మరియు హిందీ సినిమాలతో బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube