Chandini Chowdary: ఆ తెలుగమ్మాయికి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య.. ఈ ఆఫర్ తో ఆమె జాతకం మారడం ఖాయమా?

టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ( Balakrishna ) ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకుని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.

 Chandini Chowdary In Nbk 109 Movie-TeluguStop.com

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు బాలయ్య బాబు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తన తదుపరి సినిమాను దర్శకుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న విషయం తెలిసిందే.

బాలకృష్ణ కెరీర్ లో 109వ సినిమాగా( NBK 109 ) రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

ఇటీవల ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో కలర్ ఫోటో హీరోయిన్ చాందిని చౌదరి( Chandini Chowdary ) నటిస్తోందట.షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని, సినిమా అవకాశాలు పొందిన చాందిని ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

ముఖ్యంగా కలర్ ఫోటో సినిమాతో( Color Photo Movie ) భారీగా గుర్తింపును తెచ్చుకుంది.ప్రస్తుతం విశ్వక్ సేన్ సరసన గామి సినిమాలో నటిస్తున్న ఆమె ఇప్పుడు బాలయ్య సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

NBK 109 సినిమాలో చాందిని నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి.

తాజాగా సెట్స్ లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది చాందిని. సెట్స్ లో దర్శకుడు బాబీతో( Director Bobby ) దిగిన ఫొటోలను షేర్ చేసిన ఆమె తాను NBK 109 లో నటిస్తున్నట్లు చెప్పకనే చెప్పేసింది.కలర్ ఫోటో తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరసగా అవకాశాలు క్యూ కడతాయని అభిమానులు అందరూ భావించారు.

కానీ అభిమానులు ఆశించిన విధంగా మాత్రం అవకాశాలు దక్కలేదు.ఈమధ్య మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది చాందిని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube