తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఈ మేరకు మరి కాసేపటిలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
మూడు నుంచి నాలుగు రోజులపాటు పని దినాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ వారితో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తరువాత స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
అయితే బీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలకు ప్రొటెం స్పీకర్ అయ్యే అవకాశం ఉంది.ప్రతిపక్షాలు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు తీసుకోకపోతే అధికారపక్ష ఎమ్మెల్యేలే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ బాధ్యతలు తీసుకునే ఎమ్మెల్యే ఇవాళే రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది.







