ఉద్యోగాల భర్తీకై జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: డివైఎఫ్ఐ

భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ మూడో తారీఖున జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ కార్యకర్తలకు, యువతకు పిలుపునిచ్చారు.స్థానిక సుందరయ్య భవనంలో జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ అధ్యక్షుడు జరిగిన జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ ఆలంబిస్తున్న ప్రజా, యువజన వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, మోడీ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

 Chalo Delhi Job Vacancy Program Jayaprad Dyfi , Delh, Dyfi, Dyfi All India Com-TeluguStop.com

ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన మోడీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబీగుతున్నాడని, ప్రభుత్వ రంగ సంస్థలను అత్యంత తక్కువ ధరలకు కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తూ యువతలో ఉన్న చిన్న ఆశను కూడా చంపేస్తున్నాడని ఆయన అన్నారు.

మోడీ ఈ 8 ఏళ్ల పాలనలో యువతకు ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు.దేశంలో జాతీయ ఉన్మాదాన్ని ప్రేరేపించి యువతను రెచ్చగొట్టి, మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రాంతీయ తగాదాలు పెడుతూ పబ్బం వెళ్లబుచ్చుతున్నాడని ఆయన అన్నారు.

ఇట్లాంటి పాలకుల పైన యువత తిరుగుబాటు చేయాలని ఈ మేక వన్నె పులుల యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.అందుకే వేర్ ఇస్ మై జాబ్ అంటూ ఢిల్లీలో గర్జించేందుకు , మోడీ కళ్ళు తెరిపించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్లు ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీలో భారీ యువజన ర్యాలీ నిర్వహించనున్నట్లు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయునట్లు ఆయన సందర్భంగా తెలియజేశారు.యువజనుల సత్తా చూపేందుకు ఈ ర్యాలీకి, ధర్నాకు ఎక్కువమంది యూత్ కదిలి రావాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్తెనపల్లి నరేష్, భూక్య ఉపేందర్ నాయక్, శీలం వీరబాబు, దిండు మంగపతి, జిల్లా సహాయ కార్యదర్శులు చింతల రమేష్, షేక్ రోషిని ఖాన్,కూరపాటి శ్రీను, కొంగర నవీన్,సుజాత,కనపర్తి గిరి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube