విక్రమ్ సినిమాలో సూర్య పోషించిన రోలెక్స్ పాత్ర ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది.సూర్య కాకుండా మరెవరు ఆ పాత్రలో నటించినా ఈ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యేది కాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే విక్రమ్ సినిమాలో ఇష్టం లేకుండా నటించానని సూర్య చెప్పుకొచ్చారు.సైమా అవార్డ్ ఫంక్షన్ లో సూర్య మాట్లాడుతూ రోలెక్స్ రోల్ లో నటించాలంటే మొదట భయంగా అనిపించిందని అన్నారు.
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కు కాల్ చేసి చేయనని చెప్పాలని అనుకున్నానని సూర్య తెలిపారు.ఆ సమయంలో కమల్ హాసన్ సార్ ఫోన్ చేసి విక్రమ్ సినిమాలో రోల్ ఉందని చేయాలని కోరారని సూర్య చెప్పుకొచ్చారు.
కమల్ హాసన్ సార్ అడగడంతో నేను నో చెప్పలేకపోయానని సూర్య కామెంట్లు చేశారు.ఆయన కోరడంతో చివరి నిమిషంలో మనసు మార్చుకున్నానని సూర్య పేర్కొన్నారు.

విక్రమ్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన సంగతి సంగతి తెలిసిందే.ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే.విక్రమ్ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఓటీటీలో సైతం ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ కు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది.విక్రమ్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.కమల్ హాసన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సూర్య ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.







