ట్రంప్‌కు రెండవ సారి కరోనా పరీక్షలు

అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభన భయంకరంగా ఉంది.అతి తక్కువ సమయంలోనే కరోనా పాజిటివ్‌ల సంఖ్య 2.

43 లక్షలకు చేరింది.ఈ సంఖ్య మరో వారంలో మిలియన్‌ మార్క్‌ చేసే అవకాశం ఉందనే ఆందోళన అక్కడ వ్యక్తం అవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్‌ల సంఖ్య అత్యంత స్పీడ్‌గా పెరుగుతోంది.ఈసమయంలోనే అమెరికా వైట్‌ హౌస్‌లోకి కూడా కరోనా వైరస్‌ వెళ్లినట్లుగా సమాచారం అందుతోంది.వైట్‌ హౌస్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ట్రంప్‌ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అయ్యింది.

గత నెలలో ట్రంప్‌కు మొదటి సారి కరోనా వైరస్‌ టెస్టులను నిర్వహించారు.ఆ సమయంలో టెస్టు రిపోర్ట్‌ నెగటివ్‌ వచ్చింది.

Advertisement

తాజాగా మరోసారి కరోనా టెస్టును ట్రంప్‌ చేయించుకున్నాడు.ఈసారి కూడా రిపోర్ట్‌ నెగటివ్‌ వచ్చినట్లుగా ఆయన స్వయంగా తెలియజేశాడు.

కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో పరిస్థితి చేయి దాటి పోయింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఈ సమయంలో ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తేలడంతో అమెరికన్స్‌ కాస్త అయినా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు