తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ నోటీసులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ నోటీసులు జారీ చేసింది.ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై మండిపడుతోంది.

దారి మళ్లించిన రూ.152 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.ఈ మేరకు రెండు రోజుల్లోపు నిధులు చెల్లించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.

లేని పక్షంలో తదుపరి వాయిదాలను నిలిపివేస్తామని కేంద్రం హెచ్చరించినట్లు సమాచారం.జూన్ నెలలో తెలంగాణలో పర్యటించిన కేంద్ర బృందం నిధులను అనుమతి లేని పథకాలకు మళ్లించినట్లు గుర్తించింది.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు