కేంద్రం హెచ్చరిక: N95 మాస్క్‌లతో జాగ్రత్త!

కరోనా వైరస్.ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ ఇది.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోటి నలభై ఆరు లక్షల మందికి వ్యాపించింది.

87 వేల మంది కరోనా నుండి కోలుకోగా.

ఆరు లక్షల మందికి పైగా కరోనా బారిన పడి మృతి చెందారు.ఇంకా అలాంటి భయంకరమైన కరోనా నుండి మనల్ని కాపాడుతుంది ఏంటి అంటే అవి మాస్కూలే.

ఇంకా ఇప్పుడు వైద్యుల నుండి సామాన్య వరకు ప్రతిఒక్కరు ఉపయోగించే మాస్కులు N95 మాస్కులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.కానీ ఆ మాస్క్ ల వల్ల కూడా ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరిస్తుంది.ఆ ప్రమాదం ఏంటంటే.N95 అయినప్పటికీ వాల్వ్ కలిగిన మాస్కులతో ఎలాంటి ఉపయోగం లేదని అన్ని రాష్ట్రాల వైద్య అధికారులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ లేఖ రాసింది.వ్యక్తి నోటి నుంచి విడుదలయ్యే వైరస్ ని ఏ మాస్క్ లు ఆపాలేవని తెలిపింది.

నోరు ముక్కు పూర్తిగా మూసేసి మాస్కులను మాత్రమే వినియోగించాలని ఈ మేరకు ప్రజలకు అప్రమత్తం చేయాలని సూచించింది.

Advertisement

అయితే వాల్వ కలిగిన మాస్కులు కేవలం N95 మాత్రమే కాదు.ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల మాస్కులకు వాల్వ్ అందిస్తున్నారు.దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక సూచన చేసింది.

అందుకే ప్రతి ఒక్కరు కూడా సర్జికల్ మాస్క్ లను ఉపయోగించడం ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు