చివరి క్యాబినెట్ లో మోడీ తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి!

ఓ వైపు ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనకి డేట్ నిర్ణయించే పనిలో వుంది.

ఈ నేపధ్యంలో అధికార పార్టీ, ప్రధాని మోడీ పర్యటనలు నిన్నటితో పూర్తయ్యాయి.

ఇక కేంద్ర ప్రభుత్వం ఎ రోజు చివరి క్యాబినెట్ బేటీకి రెడీ అవుతుంది.ఎన్నికల ముందు కావడంతో కేంద్ర సర్కార్ చివరి క్యాబినెట్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు, హామీలతో ప్రజలని ఆకట్టుకున్న బీజేపీ సర్కార్, క్యాబినెట్ బేటీలో కీలక బిల్లులపై చర్చించే అవకాశం వుందని తెలుస్తుంది.ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఈ క్యాబినెట్ బేటీలో పలు కీలక బిల్లులపై కూడా సంతకాలు చేసే అవకాశం వున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

ఇప్పటికే మోడీ నేతృత్వంలో ఎన్డీఎ సర్కార్ మీద ప్రజలలో వ్యతిరేకత వుందని బిఆవిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఈ క్యాబినెట్ బేటీ తర్వాత మోడీ హామీ ఇచ్చి అమలు చేయని వాటిని పైకి తీసుకొచ్చి విమర్శించాలని వ్యూహ రచన చేస్తుంది.ఇక రైతులుకి సంబంధించిన పథకాలతో పాటు, విద్యావ్యవస్థ రిజర్వేషన్ లో రేషనల్ సిస్టం మీద ఈ క్యాబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వున్నట్లు కనిపిస్తుంది.

Advertisement
గిరిజనులతో సరదాగా డ్యాన్స్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు

తాజా వార్తలు