కేంద్రం తీరు తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది.రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆగ్రహం.
అసలేం జరిగింది.!? ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో కేంద్రం తీరు తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది.ఇటీవల పార్లమెంట్లో ఇద్దరు సభ్యుల పెట్రోల్ ధరలపై అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని వైజాగ్ గా పేర్కొంది.ఇచ్చిన సమాధానంలో స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్.
కాపిటల్ దగ్గర వైజాగ్.అని పొందుపరిచారు.
ఇప్పటికే మూడు రాజధానులు వ్యవహారం కోర్టులో ఉండగా కేంద్రం ఇలా సమాధానం ఇవ్వడంతో పలువుర ఆందోళన వ్యక్తం చేశారు.రాజధాని భూములు ఇచ్చిన రైతులు మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు.
రాష్ట్రం చేసిన చట్టంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని నవంబర్ లో దీనిపై విచారణ చేస్తామని కోర్టు చెప్పిందని అటువంటప్పుడు ఇలా రాయడమేమిటని, అత్యున్నత సభలో ఇలాంటి సమాధానం ఇవ్వడం ఏమిటని రాజధాని భూములు ఇచ్చిన రైతులు ప్రశ్నించారు.
దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది.కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి సమాచారం ఇచ్చిందని దీనివెనుక బిజేపి రాజకీయ కుట్ర ఉందని రాజధాని భూములు ఇచ్చిన రైతులు, పలువురు విమర్శిస్తున్నారు.