మీరు గమనించారో లేదో గాని, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన పర్యావరణ అనుకూల సూట్ జాకెట్ గురించి చాలా మంది మాట్లాడుకున్నారు.దీని గురించి రకరకాల కథనాలు సోషల్ మీడియాలో అనేకరకాల కధనాలు హల్ చల్ చేసాయి కూడా.
కాగా ఇప్పుడు, అత్యాధునిక సాంకేతికత సహాయంతో తయారు చేసిన మరో జాకెట్ గురించి పెద్ద చర్చ నడుస్తోంది.ఈ జాకెట్ దేశంలో VVIP రక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అదే బుల్లెట్ రెసిస్టెంట్ జాకెట్.
దీనిని VVIP రక్షణలో మరో ‘గేమ్ ఛేంజర్ గా ఇపుడు పిలుస్తున్నారు.
ఎందుకంటే దీనిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయడమే ఇపుడు ప్రత్యేకతని సంతరించుకుంది.VVIPలు తమ సూట్ పై ధరించేలా ఈ జాకెట్ ను చాలా ప్రత్యేకంగా రూపొందించారు.
తేలికపాటి జాకెట్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రంగుల్లో అందుబాటులోకి ఉత్పత్తిదారులు తీసుకువచ్చారు.ఇటీవల దీనిని ఏరో ఇండియా 2023 ఎయిర్ షో సందర్భంగా ప్రదర్శించారు.
VVIPల కోసం ఈ బుల్లెట్ రెసిస్టెంట్ జాకెట్‌ను అభివృద్ధి చేసినట్టు TCL (ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్) జనరల్ మేనేజర్-ఆపరేషన్స్ రాజీవ్ శర్మ చెప్పారు.

ఈ జాకెట్ ను అభివృద్ది చేసిన ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ప్రభుత్వ సంస్థ అని మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది.సాఫ్ట్ ఆర్మర్ ప్యానెల్ గా ఉపయోగించే అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలిఇత్లీన్ తో తయారు చేసిన ఈ జాకెట్ యూజర్ ను 9×19 ఎంఎం మందుగుండు సామాగ్రి (పిస్టల్స్ లేదా రివాల్వర్స్) నుంచి కాపాడుతుంది.అంటే ఇది ఒక బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ లాగా పనిచేస్తుంది.
కాగా, ఏరో ఇండియా 2023 లో టీసీఎల్ భారత వైమానిక దళం ఉపయోగించగల ఐదు కొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది.







