రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్..!!

గత రెండు నెలల నుండి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రైతులు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.

దేశ రాజధాని ఢిల్లీలో చలిని మరియు వర్షాన్ని లెక్కచేయకుండా నిరసనలు చేపడుతూ ఉన్నారు.

దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇప్పటికే తొమ్మిది సార్లు కేంద్ర పెద్దలు రైతు సంఘాలతో చర్చలు జరపగా.చాలా వరకు విఫలమవటం జరిగాయి.

ఈ పరిణామంతో కొత్త చట్టాల విషయంలో కేంద్రం వర్సెస్ రైతులు అన్నట్టు పరిస్థితి మారిపోయింది.మరోపక్క ఆందోళనలు, నిరసనలు చేస్తున్న రైతులకు విపక్షాల నుంచి మద్దతు రోజురోజుకు పెరుగుతూ ఉంది.

రైతు చట్టాల విషయంలో సుప్రీంకోర్టు కూడా కేంద్రానికి మొట్టికాయలు వేసే రీతిలో సూచనలు ఇస్తూ ఉంది.దీంతో కేంద్రం ఓ మెట్టు దిగివచ్చి వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేస్తామని చెబుతున్నా గాని రైతులు ససేమిరా అంటున్నారు.

Advertisement

మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని పట్టుబడుతూ డిమాండ్ చేస్తున్నారు.ఇటువంటి తరుణంలో రైతు చట్టాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో ఏడాదిపాటు కొత్త రైతు చట్టాలను నిలిపివేయడానికి కేంద్రం రెడీ అయ్యింది.

మరి ఈ ప్రతిపాదనకు రైతులు ఏమంటారు అన్నది సస్పెన్స్ గా ఉంది.

Advertisement

తాజా వార్తలు