381 కట్స్ పడ్డాయి సన్నీ లియోన్ సినిమాకి

సినిమాలో రెండు మూడు కట్స్ పడితేనే గగ్గోలు పెడతారు దర్శకనిర్మాతలు, మరి అలాంటిది 381 కట్స్ ఒకే సినిమాకి పడితే ? అసలు సినిమా ఇంకెందుకు చూడాలి అనేంత విరక్తి కలుగుతోంది కదా.

సెన్సార్ తీరుపట్ల చాలా మండే అసహన వ్యక్తం చేస్తున్నారు.ఆ సినిమా పేరు మస్తిజాదే.సన్నీ లియోన్ హీరోయిన్.

ఈ రోజే విడుదలైంది."రోజురోజుకి సెన్సార్ దారుణంగా ప్రవర్తిస్తోంది.

సన్నీ లియోన్ సినిమా అంటే ఏం ఆశిస్తారో జనాలు వాళ్లకు తెలిదా ? వాటిని ఆధారం చేసుకొనే కదా నిర్మాతలు డబ్బులు పెట్టేది.సన్నీ సినిమాకి ఫ్యామిలిని పట్టుకొని రారు కదా థియేటర్ కి.మరింకెందుకు అభ్యంతరం.ఇలాంటి సినిమాలు నచ్చనివాళ్ళు ఎలాగో థియేటర్ కి రారు.

వచ్చినవారు సెన్సార్ బోర్డు చేసిన పనికి ఖచ్చితంగా నిరాశపడతారు.ఇవన్ని చేసి ఇచ్చింది ఏ సర్టిఫికేటే కదా" అంటూ వాఖ్యానించారు ఒక ట్రేడ్ పండితుడు సినిమా ట్రైలర్ చూసి అతిగా ఆశపడి, థియేటర్లో కట్స్ దెబ్బకు ఈరోజు నుంచి ఎంతమంది బలవుతారో ఏదైనా సెన్సార్ బోర్డు అతిగా వ్యవహరిస్తున్నది మాత్రం కాదనలేని వాస్తవం.

ఏ సర్టిఫికేట్ సినిమాలని ఎవరు చూస్తారో ఎందుకు చూస్తారో అవగాహన ఉండీ కూడా ఇలా చేయడం ఏంటో !.

Chandra Mohan : ఒక పక్క తల్లి శవం..అయిన షూటింగ్ పూర్తి చేసిన చంద్ర మోహన్

తాజా వార్తలు