ఈ సెలెబ్రిటీస్ కి పాకిస్థాన్ నేల తో ఉన్న సంబంధాలు ఏంటో తెలుసా..?

పాకిస్థాన్ కు.హిందూస్థాన్ కు అవినాభావ సంబంధం ఉంది.

ఇప్పుడంటే ఈ రెండు దేశాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.

కానీ ఒకప్పుడు పాకిస్థాన్ ఇండియాలో ఒక భాగం.

ఆంగ్లేయుల పుణ్యమా అని పాకిస్తాన్ మన దేశం నుంచి వేరు అయ్యింది.తెల్లవారి పాలన అంతం అయ్యే నాటికి భారత్, పాక్ వేరుపడ్డాయి.

అదే సమయంలో పలువురు పాకిస్థాన్ వాసులు ఇండియాకు.భారతీయులు పాకిస్థాన్ కు వెళ్లారు.

Advertisement

ఇరు దేశాల మధ్య ముళ్ళకంచె పడింది.అనంతరం ఇరు దేశాల నడుమ తలెత్తిన వివాదాలు మరింత ముదిరాయి.

బద్దశత్రు దేశాలుగా మారాయి.దేశాలు వేరైనా ఇరు దేశాల మధ్య బంధుత్వాలు ఇప్పటికీ ఉన్నాయి.

పాక్ లో భారతీయుల చుట్టాలు.ఇండియాలో పాకిస్థాన్ దేశస్తులు చుట్టాలు ఇప్పటికీ వున్నారు.

బాలీవుడ్ కు పాకిస్తాన్ కు మధ్య సంబంధాలు మరీ దగ్గరగా ఉన్నాయి.పలువురు బాలీవుడ్ నటీనటులకు ఆదేశంతో సంబంధాలు ఉన్నాయి.ఇంతకీ ఆదేశంతో సంబంధం ఉన్న ఈ దేశ నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం!

బిగ్ బి:

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ అమ్మమ్మ ఊరు పాకిస్థాన్ లో ఉంది.ఆయన తల్లి తేజ్ బచ్చన్.పాకిస్థాన్ లోని పైసలాబాద్ లో జన్మించారు.

షారుఖ్ ఖాన్:

Advertisement

షారుక్ తండ్రిది పాకిస్తాన్ లోని పెషావర్.దేశ విభజన సమయంలో ఆయన ఢిల్లీకి వలస వచ్చారు.

గోవింద:

నటుడు గోవిందకు కూడా పాక్ తో సంబంధాలు ఉన్నాయి.ఆయన తండ్రి అర్జున్ కుమార్ ఆహుజ.పాక్ లోని గుజ్రాన్ వాలాలో జన్మించారు.

హృతిక్ రోషన్:

ఇతడి నాన్నమ్మ, అమ్మమ్మ ఊళ్ళు పాకిస్థాన్ లొనే ఉన్నాయి.ఆయన తండ్రి.పాదర్ గుజ్రాన్ వాలలో పుడితే.

తల్లి ఫాదర్ సియాల్ కోట్ లో జన్మించారు.దేశ విభజన సమయంలో ఇండియాకు వలస వచ్చారు.

అమ్రిష్ పూరి:

బాలీవుడ్ సహా పలు భాషల సినిమాల్లో విలన్ వేషాలు వీలైన అమ్రిస్ పూరి సైతం పాక్ కు చెందిన వారే.ఆయన లాహోర్ లో జన్మించారు.

వివేక్ ఓబేరాయ్:

ఈయన తండ్రి సురేష్ ఓబేరాయ్.ఈయన క్వెట్టాలో జన్మించారు.ప్రస్తుతం ఈ ప్రాంతం పాక్ నుంచి స్వాతంత్ర్యo కోసం పోరాడుతున్న బెలూచిస్తాన్ లో ఉంది.

వీరితో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులకు పాక్ తో సంబంధాలు ఉన్నాయి.

తాజా వార్తలు