బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది.ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో భాగంగా ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవీలను సీబీఐ అధికారులు విచారించారు.కాగా తేజస్వి యాదవ్ కు సమన్లు ఇవ్వడం రెండోసారి కావడం గమనార్హం.2004 నుంచి 2009 సంవత్సరాల మధ్యలో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని సీబీఐ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.