పొట్ట కొవ్వును మాయం చేసే నెయ్యి.. ఎలా వాడాలంటే?

నెయ్యి. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

 How To Use Ghee For Belly Fat Burning Details, Ghee, Ghee Benefits, Latest News-TeluguStop.com

చక్కని రుచి, సువాసన కలిగి ఉండే నెయ్యి లో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తుంటారు.అలాగే పొట్ట వచ్చేస్తుందని నమ్ముతుంటారు.

కానీ సరైన పద్ధతిలో నెయ్యిని వాడితే బరువు పెరగడం కాదు తగ్గుతారు.పైగా పొట్ట కొవ్వును మాయం చేసేందుకు నెయ్యి(Ghee) అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంతకీ బెల్లీ ఫ్యాట్ దూరం కావాలంటే నెయ్యిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి.

నెయ్యి కాస్త హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి పది సెకండ్ల పాటు హీట్ చేసి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలి.కనీసం ఎన‌మిది నుంచి ప‌ది నిమిషాల పాటు చిన్న మంటపై వాటర్ ను మరిగించాలి.

ఆపై స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించడమే.

Telugu Belly Fat, Ghee, Ghee Benefits, Ginger Powder, Tips, Latest, Turmeric-Tel

ఈ డ్రింక్ ను రోజుకు ఒక గ్లాసు చొప్పున ప్రతి రోజు తీసుకుంటే పొట్ట కొవ్వు(Belly Fat) కొద్ది రోజుల్లోనే మాయం అవుతుంది.అలాగే వెయిట్ లాస్ కు కూడా ఈ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.అలాగే స్త్రీలలో చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్(Irregular Periods) సమస్యతో బాధపడుతుంటారు.

అలాంటి వారు ఈ డ్రింక్ ను తరచూ తీసుకుంటే నెలసరి క్రమం తప్పకుండా ఉంటుంది.

Telugu Belly Fat, Ghee, Ghee Benefits, Ginger Powder, Tips, Latest, Turmeric-Tel

అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది.క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు బ్లడ్ షుగర్ లెవెల్స్(Diabetes) కూడా కంట్రోల్ లో ఉంటాయి.

కాబట్టి ఎవరైతే బెల్లీ ఫ్యాట్ మరియు అధిక బరువు సమస్యల‌తో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ డ్రింక్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube