ఢిల్లీ డిప్యూటీ సీఎం సీబీఐ కస్టడీ అంశంపై తీర్పు రిజర్వ్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ కస్టడీకి అప్పగించే అంశంపై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ చేస్తున్న సీబీఐ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సిసోడియాను తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ వాదనలు వినిపించింది.మరోవైపు అరెస్టుకు సరైన కారణాలు లేవని సిసోడియా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న స్పెషల్ కోర్టు జడ్జి ఎంకే నాగ్ పాల్ తీర్పును రిజర్వ్ చేశారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు