వివేకా హ‌త్య కేసులో సీబీఐ దూకుడు.. కీల‌క ఆధారాల సేక‌ర‌ణ‌!

ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన జ‌గ‌న్ బాబాయ్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుపై ఎన్నో మ‌లుపులు తిరుగుతున్నాయి.అయితే ఇప్పుడు ఇదే కేసులో సీబీఐ దూకుడు పెంచింది.

చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ కేసును విచార‌ణ చేస్తోంది.సోమవారం నుంచి విచారణ స్టార్ట్ చేసి కీల‌క ఆధారాల‌ను సేకరిస్తోంది.

ప్రస్తుతం రెండో దశ విచారణగా పేర్కొంటున్నారు అధికారులు.ఇందులో భాగంగా మొద‌టి రోజు వివేకా డ్రైవ‌ర్ ద‌స్త‌గిరిని మొద‌టి రోజు విచారించారు.

ఈ ద‌ర్యాప్తును కడప జిల్లాలోని సెంట్రల్ జైలులో ఉన్న గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు స్టార్ట్ చేశారు.ఇందుకోసం ప్ర‌త్యేక నిఘా ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Advertisement

ఇక దస్తగిరిని సోమ‌వారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించి, కీల‌క ఆధారాలు సేక‌రించిన‌ట్టు తెలుస్తోంది.దస్తగిరి విచార‌ణ సంద‌ర్భంగా ఇచ్చిన వివ‌రాల‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేసి, దానిపై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

ఇక విచార‌ణ త‌ర్వాత డ్రైవ‌ర్ ద‌స్త‌గిరిని పులివెందులకు తీసుకెల్లి హ‌త్య కేసులో కీల‌క విషయాలపై ప్ర‌శ్న‌లు వేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ఆ త‌ర్వాత ద‌స్త‌గిరిని వ‌దిలేసిన అధికారులు.త్వ‌ర‌లో మ‌రోసారి డ్రైవర్ ను విచారిస్తామని తెలిపారు.ఇక దీంతో పాటు ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌రికొంత‌మంది అనుమానితులను కూడా అధికారులు త్వ‌ర‌లోనే ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంది.

ఇక ఈ కేసు జాప్యం అవుతోంద‌ని వివేకా కుమార్తె సునీత ప‌లుమార్లు అసంతృప్తి తెల‌ప‌డంతో సీబీఐ అధికారులు కేసులు మ‌ళ్లీ వేగ‌వంతం చేశారు.ఇప్పటికే డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు ఢిల్లీలో 30 రోజులు ప్ర‌శ్న‌లు వేసి, ప‌లు కీల‌క ఆధారాలను సేక‌రించారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఇక ఇప్పుడు తాజాగా మ‌రోసారి విచార‌ణ జ‌ర‌ప‌డంతో.రాజ‌కీయంగా కొంత ఆందోళ‌న మొద‌ల‌యింద‌ని చెప్పాలి.మ‌రి అధికారులు త‌ర్వాత ఎవ‌రిని విచారిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు