నీరా రాడియాకు సీబీఐ క్లీన్ చిట్

నీరా రాడియా టేపుల వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు విచార‌ణ జ‌రిపింది.2009లో కేంద్ర కేబినెట్ లో మంత్రుల‌కు శాఖల కేటాయింపుల‌కు సంబంధించి నీరా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలో ద‌ర్యాప్తు చేప‌ట్టిన సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.

ఈ కేసులో నిందితురాలిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నీరాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.దీనిపై న‌మోదు చేసిన 14 కేసులలో ఇప్ప‌టికే ప్రాథ‌మిక విచార‌ణ పూర్తయిందని ధ‌ర్మాస‌నానికి సీబీఐ తెలిపింది.

కానీ ఒక్క దానిలో కూడా అక్ర‌మాలకు పాల్ప‌డిన‌ట్లుగా ఎటువంటి ఆధారాలు ల‌భించ‌లేద‌ని పేర్కొంది.ఈ అఫిడ‌విట్‌ను ప‌రిశీలించిన సుప్రీంకోర్టు విచార‌ణ‌ను వ‌చ్చే వారానికి వాయిదా వేసింది.

ఇదేం శ్యాడిజం.. స్కూటీని ఢీ కొట్టడమే కాకుండా అమాంతం ఈడ్చుకెళ్లిన కారు..
Advertisement

తాజా వార్తలు