జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు అంటూ కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తారీకు ఎన్నికల జరగనున్నాయి.జూన్ 4వ తారీఖు ఫలితాలు.

వచ్చే సోమవారమే పోలింగ్. ప్రస్తుతం ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో భారీ ఎత్తున పాల్గొంటున్నారు.

ఈ క్రమంలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ప్రజలకు సంచలన హామీలు ప్రకటిస్తున్నారు.ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని ఇటీవల నాంపల్లి సీబీఐ కోర్టులో( Nampally CBI Court ) దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించడానికి అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది.దీనిపై నిన్న విచారణ జరిపిన సీబీఐ( CBI ) న్యాయస్థానం కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.

Advertisement

ఈ నేపథ్యంలో సీబీఐ నేడు కోర్టులో తమ వాదనలు వినిపించింది.ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని నాంపల్లి కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది.అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతున్నందుకు ఆయనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది.

ఇప్పటికే ఓసారి విదేశాలకు వెళ్లొచ్చారని గుర్తుచేసింది.కాగా దీనిపై తదుపరి విచారణ మే 14న ఉంటుందని పేర్కొంది.

ఏపీలో మే 13న పోలింగ్ జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఈ వ్యవధిలో కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ భావించారు.

ఈ క్రమంలో కోర్టు పర్మిషన్ తీసుకోవాలని పిటీషన్ వెయ్యగా సీబీఐ.అనుమతి ఇవ్వొద్దని.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
'డాకు మహారాజ్ ' సినిమా ట్రైలర్ లో బాబీ చేసిన తప్పు ఏంటో తెలుసా..?

కౌంటర్ దాఖలు చేయటం సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు