కమ్మ వర్సెస్ కాపు ? వామ్మో ఆ పార్టీలో వార్ ఓ రేంజ్ లో ?

ఏపీలో కుల రాజకీయాలు వేడెక్కాయి.సామాజిక వర్గాల వారీగా ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి.

ప్రతి పార్టీ, ప్రతినాయకుడు కులాల లెక్కల ఆధారంగానే రాజకీయాలు చేసే పరిస్థితి అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది.ఇది ఇలా ఉంటే, ఏపీలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కమ్మ, కాపు, రెడ్లు ఎప్పుడూ అధికారం కోసం పోటీ పడుతూనే ఉంటారు.

ఇప్పటికే ఏపీలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారు ముఖ్యమంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.కానీ మరో బలమైన కాపు సామాజిక వర్గం మాత్రం అధికారం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా అవకాశం దక్కడం లేదు.

తెలుగుదేశం పార్టీ, లేకపోతే వైసీపీ మాత్రమే అధికారం దక్కించుకుంటున్నాయి.జనసేన పార్టీ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ ఏపీలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కూడా పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నారు.ఇది ఇలా ఉంటే, ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది.

బిజెపి సహకారంతో ఏపీలో అధికారం దక్కించుకోవాలని జనసేన చూస్తుండగా, జనసేన సహకారంతోనే బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ అగ్ర నాయకులు భావిస్తున్నారు.దీనిలో భాగంగానే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.

టిడిపి, వైసిపి లకు ధీటుగా బలపడాలంటే కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తించిన బిజెపి పెద్దలు ఆ వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ తోనూ పొత్తు పెట్టుకుంది.

అలాగే ఏపీ బిజెపి అధ్యక్షుడిగా అదే సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉండగా, ఆయన స్థానంలో అదే కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుని అధ్యక్షుడిగా నియమించారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
రేవంత్ కు టార్గెట్ అయిపోయిన హరీష్ రావు

ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులను కలుస్తూ, మద్దతు కూడగడుతున్నారు.మెగాస్టార్ చిరంజీవితో సైతం ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇది ఇలా ఉంటే, ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై బీజేపీలోని కమ్మ సామజిక వర్గం నాయకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఎక్కువగా పార్టీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పించే విధంగా వ్యవహరిస్తున్న తీరుపై, ఆ సామాజికవర్గం నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు బీజేపీలోని బాబు అనుకూల వర్గం గా పేరుపొందిన సుజనా చౌదరి వంటి వారిని కట్టడి చేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.

పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, దీనికి బిజెపి పెద్దల మద్దతు ఉండడంతో, సుజనా చౌదరి వంటి వారు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కామినేని శ్రీనివాస రావు, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, సుజనా చౌదరి వంటి నాయకులు హాజరు కాకపోవడం పైన రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పార్టీలో కాపు సామాజిక వర్గం ప్రభావం పెరిగితే తమ హవాకు గండి పడుతుంది అనే అభిప్రాయంతో వీరంతా ఆలోచనలో పడ్డారట.

సోము వీర్రాజు ఎత్తుగడలకు ఎక్కడికక్కడ బ్రేక్ వేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ వ్యూహాలు రోపొందించుకోవడంలో బిజీగా ఉన్నారట.

తాజా వార్తలు