ట్రంప్ కు అదిరిపోయే షాక్...కోర్టుకెక్కిన పోలీసులు..ట్విస్ట్ ఏంటంటే..!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై అమెరికా పోలీసులు కోర్టుకెక్కారు.

ట్రంప్ వలన తాము తీవ్ర నష్టాన్ని చవిచూశామని మాకు ఒక్కొక్కరికి 75వేల డాలర్లు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ ఘటనతో ఒక్క సారిగా ట్రంప్ వర్గం షాక్ అయ్యింది.ఇంతకీ పోలీసులు ట్రంప్ పై కోర్టులో ఎందుకు పిటిషన్ వేసినట్టు అంటే.

అధ్యక్ష్య ఎన్నికలు ముగిసిన తరువాత క్యాపిటల్ భవనం పై జరిగిన దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచిన విషయం విదితమే.అమెరికా చరిత్రలో ఎన్నడూ ఈ తరహా దాడులు జరగలేదు.

దాంతో వేలాది మంది అమెరికన్స్ క్యాపిటల్ భవనం లోకి చొచ్చుకుని వచ్చి నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు.ఈ ఘటనకు ప్రధాన కారకుడు అప్పటి అధ్యక్షుడు ట్రంప్ అని ప్రతీ ఒక్కరికి తెలిసిన విషయమే ఈ ఘటన కారణంగా ఎంతో మంది పోలీసులు గాయాల పాలయ్యారు, అమెరికన్స్ పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.దాంతో

Advertisement

ఒక పోలీసు అధికారితో సహా నలుగురు ఆందోళన దారులు మృతి చెందారు.ఈ మొత్తం దారుణానికి ప్రధాన కారకుడు ట్రంప్ మాత్రమేనని, ఆందోళన కారులను రెచ్చగొట్టడంవలెనే ఈ దాడులు జరిగాయని, పోలీసు అధికారి ఒకరు మృతి చెందడమే కాకుండా , ఎంతో మంది గాయాల పాలయ్యారని, ప్రతీ పోలీసు అధికారి మానసిక ఆందోళనకు లోనయ్యామని జేమ్స్, హెంబి అనే ఇద్దరు పోలీసు అధికారులు కోర్టులో దావా వేశారు.ఈ మేరకు మాలో ప్రతీ ఒక్కరికి 75వేల డాలర్ల నష్ట పరిహారం కావాలని కోరారు.

అంతేకాదు అప్పట్లో ట్రంప్ రెచ్చ గొట్టే విధంగా చేసిన ట్వీట్లను కూడా జతపరిచారు.ఒక వేళ ఈ కేసు పోలీసులు విజయం సాధిస్తే ట్రంప్ భారీగానే పోలీసులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.

Advertisement

తాజా వార్తలు