మరింత ఆసక్తిని పెంచిన 'కేస్‌ 99' కొత్త ప్రోమో

నటుడు ఫిల్మ్‌ మేకర్‌ అయిన ప్రియదర్శిణి రామ్‌ తాజాగా తెరకెక్కించిన సినిమా కేస్‌ 99.

ఈ సినిమాకు సంబంధించిన వీడియోలను వరుసగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

ఈసారి ఆయన తీసుకు వచ్చిన ప్రోమో సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతోంది.ఆ ప్రోమోలో అమ్మాయిలు అబ్బాయిల వలలో ఎలా పడుతున్నారు.

ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది చూపించారు.అబ్బాయిలు కేవలం అమ్మాయిల నుండి అది ఆశించి మాత్రమే ప్రేమిస్తారని కాని అమ్మాయిలు మాత్రం ప్రేమ కోసం దానికి ఒప్పుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు.

ప్రోమోలోని ఆ డైలాగ్‌తో సినిమా మొత్తంను దర్శకుడు కళ్లకు కట్టినట్లుగా చూపించాడు.నిజంగా ఈ సినిమా యువతకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నట్లుగా అనిపిస్తుంది.

Advertisement

అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంతో పాటు ప్రస్తుతం ఉన్న ప్రేక్షకుల ఉద్దేశ్యాలను కూడా మార్చే విధంగా ఉంది అంటున్నారు.ఈతరం యువతను తప్పుదోవ పట్టిస్తున్న ప్రేమ ఆకర్షణ అనే విషయాలను బేస్‌ చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

భారీ అంచనాలు లేకున్నా కూడా ప్రోమో విడుదల తర్వాత సినిమాలో మ్యాటర్‌ ఉందేమో అనిపించేలా ఆసక్తి అయితే పెరిగింది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

త్వరలోనే సినిమా పూర్తి చేసి విడుదలకు రెడీ చేస్తామంటూ ప్రకటించారు.ఈ సినిమాలో ఒక మర్డర్‌ మిస్టరీని ఛేదించే ఆఫీసర్‌గా ప్రియదర్శిణి రామ్‌ కనిపించబోతున్నాడు.

అలాగే ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంతో పాటు సందేశాత్మకంగా ఉండబోతున్న ఈ సినిమాతో అయినా యువతలో మార్పు వస్తుందని ఆశిద్దాం.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
బైక్‌పై వెళ్తున్నాడా.. లేక నిద్రపోతున్నాడా? కుక్క మాత్రం ఏం చేసిందో చూడండి!

ప్రస్తుతం థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకునేందుకు కేంద్రం ఓకే చెప్పింది.కాని ప్రేక్షకులు థియేటర్లకు ఇంకా వచ్చే పరిస్థితి లేని కారణంగా సినిమాలు ఏమీ కూడా విడుదల అవ్వడం లేదు.

Advertisement

పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతామని ప్రియదర్శిణి రామ్‌ అంటున్నాడు.

తాజా వార్తలు