Chandrababu Prajagalam : ఎన్నికల యుద్ధంలో ఎన్డీఏ గెలుపును ఆపలేరు..: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో( Prajagalam Meeting ) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

పొత్తులతో వెళ్తున్న తమ మూడు పార్టీలు ఒక్కటేనని చంద్రబాబు తెలిపారు.ఇందులో ఒక పార్టీ ఎక్కువ, మరో పార్టీ తక్కువ కాదన్నారు.400 కు పైగా పార్లమెంట్ సీట్లు రావాలన్న చంద్రబాబు ఏపీలో 160 కి పైగా ఎమ్మెల్యేలు, 24 కు పైగా ఎంపీలు విజయం సాధించాలన్నారు.కడప కూడా తమదేనన్నారు.

తాము అనుకున్నట్లు అన్ని వస్తే ఎక్కడుంటామో తెలియనంతగా ఆనందం ఉందన్నారు.ప్రజాగళం ముందు ఎవరూ నిలవలేరని తెలిపారు.ఈ నేపథ్యంలో గేమ్ స్టార్ట్ అయిందన్న చంద్రబాబు ఎన్నికల యుద్ధంలో ఎన్డీఏ( NDA ) గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.

అదేవిధంగా రాజకీయ నేతకు కావాల్సింది ప్రజాదరణ అని చెప్పారు.తన దగ్గర డబ్బులు లేవు, ప్రైవేట్ సైన్యం వంటివి ఏం లేవని తెలిపారు.ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

Advertisement
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు