కెనడా : 1984 సిక్కుల ఊచకోత అంశాన్ని కదిపిన ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్

కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో( Prime Minister Justin Trudeau ) నేతృత్వంలోని పాలక లిబరల్ పార్టీతో పొత్తులో ఉన్న కెనడా న్యూడెమొక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ) ఆ దేశ పార్లమెంట్‌లో 1984 సిక్కులపై జరిగిన మారణహోమానికి( 1984 Sikh Genocide ) అధికారిక గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది.

సిక్కుల ఊచకోత జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎన్డీపీ( NDP ) ఈ ప్రచారం ప్రారంభించింది.

శనివారం బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో జరిగిన వైశాఖి కవాతులో జగ్మీత్ సింగ్( Jagmeet Singh ) మాట్లాడుతూ.సిక్కులపై జరిగిన మారణహోమాన్ని సమాఖ్య స్థాయిలో గుర్తించాలని డిమాండ్ చేశారు.

ఈ రాష్ట్ర వ్యవస్థీకృత హత్యాకాండను మారణహోమంగా అధికారికంగా గుర్తించాలని , తాము కెనడా ప్రభుత్వాన్ని( Canada Govt ) కోరుతున్నామని జగ్మీత్ సింగ్ పేర్కొన్నారు.కాగా.

ఏప్రిల్ 2017లోనూ అంటారియో శాసనసభ ఇదే తరహా తీర్మానాన్ని ఆమోదించింది.ఇది అప్పట్లో కెనడా - భారత్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపింది.

Advertisement

వాస్తవానికి అంటారియో శాసనసభ సభ్యుడిగా వున్నప్పుడు జగ్మీత్ సింగ్ 2016లో ఇదే విధమైన తీర్మానాన్ని సమర్పించారు.అయితే ఆ తర్వాతి ఏడాది అప్పటి , ప్రస్తుత లిబరల్ పార్టీకి చెందిన అంటారియో శాసనసభ్యుడు హరీందర్ మల్హి తీసుకొచ్చినది ఆమోదం పొందింది.

ఇకపోతే.జగ్మీత్ సింగ్‌కు 2013 డిసెంబర్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్( Manmohan Singh ) ప్రభుత్వం భారత్ వచ్చేందుకు వీసాను నిరాకరించింది.సర్రేలో జరిగిన పరేడ్‌లో జగ్మీత్ సింగ్ మాట్లాడుతూ.నిజ్జర్ చేసిన త్యాగాన్ని తాను గుర్తించానని పేర్కొన్నారు.2010లోనూ లిబరల్ పార్టీ ఎంపీ సుఖ్ ధాలివాల్ .( MP Sukh Dhaliwal ) కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ ఎదుట సిక్కు మారణహోమం మోషన్‌ను తీసుకొచ్చినప్పటికీ అది విఫలమైంది.హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య, ఇతర కారణాలతో న్యూఢిల్లీ - ఒట్టావా మధ్య ఇప్పటికే సంబంధాలు అంతంత మాత్రంగా వున్న వేళ ఎన్డీపీ 1984 సిక్కుల ఊచకోత అంశాన్ని తెరమీదకు తీసుకురావడంతో ఇరుదేశాల మధ్య మరిన్ని ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం వుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

1984 అక్టోబరు 31న అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీని. ఆమె బాడీగార్డులైన సత్వంత్‌ సింగ్‌, బీయాంత్‌ సింగ్‌ కాల్చి చంపారు.ఇందిర హత్యతో దేశం ఉడికిపోయింది.

ఈ హత్యకు ప్రతీకారంగా పలు చోట్ల సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి.దేశ రాజధాని ఢిల్లీతో పాటు చాలా ప్రాంతాల్లో సిక్కులను ఊచకోత కోశారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌ చనిపోయినట్లుగా ప్రచారం.. అవాస్తవమన్న అమెరికా పోలీసులు

ఆస్తుల ధ్వంసం, మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దోపిడిలతో అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి.ఈ అల్లర్లలో దాదాపు 2800 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక లెక్కలు చెబుతున్నా.

Advertisement

ఈ సంఖ్య భారీగానే వుంటుందని అంచనా.

తాజా వార్తలు