త్వరలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్( KCR ) ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.ఈ మేరకు రేపటి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
కేసీఆర్ రేపటి నుంచి బస్సు యాత్ర( Bus Yatra ) నిర్వహించనుండగా.ఇందుకోసం పార్టీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఈ క్రమంలోనే ప్రచార రథానికి తెలంగాణభవన్ లో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రేపు మిర్యాలగూడ,( Miryalaguda ) సూర్యాపేట( Suryapet ) నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.
దాదాపు 17 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో భాగంగా మొత్తం 21 ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు.మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర కొనసాగనుంది.
ఈ యాత్రలో భాగంగా రోడ్ షోలతో పాటు భారీ బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.అయితే రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలని బీఆర్ఎస్ భావిస్తోన్న సంగతి తెలిసిందే.