రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఉన్న హోం గర్డ్స్ సిబ్బందికి ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో వర్షాకాల సమయంలో విధినిర్వహణలో భాగంగా వెసుకోవడానికి రెయిన్ కోట్స్ అందజేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో హోమ్ గార్డ్స్ సిబ్బందికి మునుపెన్నడు లేనివిధంగా స్వెట్టర్స్,యూనిఫామ్, షూ, రాయితితో కూడిన హెల్త్ కార్డ్స్ తో పాటుగా ట్రాఫిక్ డ్యూటీ లు నిర్వహించే సిబ్బందికి కూలింగ్ గ్లాసెస్, వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగిందని, రానున్న వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో ఉన్న హోం గర్డ్స్ సిబ్బంది కి రెయిన్ కోట్స్ అందజేయడం జరిగింది.
నిరంతరం ఎండనకా, వాననకా రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే సిబ్బందికి అత్యవసర సమయాలలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండు విధులు నిర్వహించాలని,అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ డ్యూటీ నిర్వహించే సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో పని చేస్తున్న హోం గార్డ్స్ అన్ని రకాల వసతులు కల్పిస్తూ అండగా నిలుస్తూన్న జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన సిబ్బంది.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, హోమ్ గార్డ్ ఆర్.ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్,హోమ్ గార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.