నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్ట్ , జస్టిన్ ట్రూడో ఫస్ట్ రియాక్షన్

ఖలిస్తానీ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు( Hardeep Singh Nijjar )కు సంబంధించి ముగ్గురు అనుమానిత భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేయడం దుమారం రేపుతోంది.

ఈ పరిణామంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు.

శనివారం టొరంటో గాలాలో జరిగిన సిఖ్ హెరిటేజ్ డేలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కెనడా రూల్ ఆఫ్ లా , స్వతంత్ర న్యాయవ్యవస్ధ వున్న దేశమని పేర్కొన్నారు.

పౌరులందరి రక్షణే తమ ప్రాథమిక నిబద్ధత అని ట్రూడో స్పష్టం చేశారు.

ఆర్‌సీఎంపీ చెప్పినట్లుగానే .నిజ్జర్ హత్యలో అరెస్ట్ అయిన ముగ్గురు వ్యక్తుల ప్రమేయంపై ప్రత్యేక, విభిన్న దర్యాప్తు కొనసాగుతుందని ప్రధాని వెల్లడించారు.హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడాలోని సిక్కు సమాజం తాము అసురక్షితంగా వున్నట్లుగా భావిస్తున్నారని జస్టిన్ ట్రూడో( PM Justin Trudeau ) అన్నారు.

Advertisement

ప్రతి కెనడియన్‌కు ఈ దేశంలో వివక్ష, హింస, బెదిరింపుల నుంచి సురక్షితంగా వుండేందుకు ప్రాథమిక హక్కు వుందన్నారు.

మరోవైపు.నిజ్జర్ హత్య, ముగ్గురు భారతీయుల అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ( S Jaishankar )స్పందించారు.ఖలిస్తాన్ అనుకూల వర్గంలోని ఒక సమూహం కెనడా ప్రజాస్వామ్యాన్ని ఉపయోంచుకుంటున్నారని.

లాబీని సృష్టించి ఓటు బ్యాంక్‌గా మార్చారని జైశంకర్ ఆరోపించారు.కెనడా పాలకపక్షానికి పార్లమెంట్‌లో మెజారిటీ లేదని.

కొన్ని పార్టీలు ఖలిస్తాన్ అనుకూల నాయకులపై ఆధారపడతాయన్నారు.వీసా, చట్టబద్ధత, పొలిటికల్ స్పేస్‌ను ఖలిస్తాన్ మద్ధతుదారులకు ఇవ్వొద్దని భారత్ ఇప్పటికే కెనడాకు సూచించిందని.

సినిమా బడ్జెట్ 600 కోట్లు తిరిగేదేమో 10 లక్షల కారు.. నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడుతున్న ఎన్టీయార్...

లేనిపక్షంలో అవి ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని జైశంకర్ హెచ్చరించారు.కొన్ని సందర్భాల్లో కెనడా తమతో ఎలాంటి ఆధారాలను పంచుకోదని.

Advertisement

పోలీస్ ఏజెన్సీలు కూడా సహకరించవని విదేశాంగ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.కానీ కెనడాలో భారత్‌ను నిందించడం వారి రాజకీయ దుర్బలత్వానికి నిదర్శనమని .త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్నందున , వారు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మునిగిపోతారని జైశంకర్ చురకలంటించారు.కాగా.

నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయంపై కెనడియన్ పోలీసులు ఎలాంటి ఆధారాలు చూపలేదు.ఈ క్రమంలో అరెస్ట్ అయిన ముగ్గురు భారతీయుల ఫోటోలను మాత్రం శుక్రవారం విడుదల చేశారు.

కరణ్ ప్రీత్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్‌లను అల్బెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్‌ సిటీలో అరెస్ట్ చేశారు.ఆర్‌సీఎంపీ (సర్రే)కి చెందిన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) శుక్రవారం ఉదయం ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ సాయంతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు