అమెరికాకి ఎర్త్ పెట్టిన కెనడా, హెచ్ 1 బీ వీసా హోల్డర్స్‌ కోసం స్పెషల్ వర్క్ పర్మిట్.. భారతీయులకు లబ్ధి

విదేశాలకు చెందిన నిపుణులైన వారిని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసా( H1B Visa ) హాట్ కేక్ వంటిదన్న సంగతి తెలిసిందే.

హెచ్ 1 బీ సంపాదించి కొన్నాళ్ల తర్వాత పర్మినెంట్ రెసిడెన్స్ పొంది అమెరికాలోనే స్థిరపడాలన్నది భారతీయులు సహా ఎంతో మంది విదేశీయుల కల.

అయితే హెచ్ 1 బీ పొందడం అంత ఈజీ కాదు, ఒకవేళ కష్టపడి సంపాదించినా దానిని నిలబెట్టుకోవడం కూడా కత్తిమీద సామే.ఇలాంటి వారిని కెనడా ( Canada )టార్గెట్ చేసింది.

అమెరికాలో హెచ్ 1 బీ హోల్డర్లు తమ కుటుంబ సభ్యులతో సహా కెనడాకి వచ్చి ఉద్యోగాలు చేసుకోవచ్చని ప్రకటించింది.అంతేకాదు.వర్క్ పర్మిట్ కూడా ఉచితంగా ఇస్తామని, వారి కుటుంబ సభ్యులకు కూడా ఎన్నో మినహాయింపులు ఇస్తామని తెలిపింది.

సాధారణంగా అమెరికాలో హెచ్ 1 బీ వీసాపై ఉద్యోగం సంపాదించిన వారు తమపై ఆధారపడిన వారిని డిపెండెంట్ వీసాపై యూఎస్( US ) తీసుకెళ్లవచ్చు.అయితే డిపెండెంట్ వీసాపై అమెరికాలో అడుగుపెట్టిన హెచ్‌ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులు చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా ప్రత్యక అనుమతులు పొందాల్సి వుంటుంది.

Advertisement

అయితే హెచ్ 1 బీ వీసాదారులను కూడా 60 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధన భయపెడుతోంది.హెచ్ 1 బీ వీసాదారులు ఒకవేళ ఉద్యోగాన్ని కోల్పోతే.60 రోజుల లోపు కొత్త ఉద్యోగాన్ని సంపాదించాలి.లేని పక్షంలో వారు అమెరికాలో వుండటానికి అనర్హులు.

ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.

అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.కాలం చెల్లిన హెచ్ 1 బీ వీసా విధానం కారణంగా అమెరికా నుంచి ప్రతిభావంతులైన భారతీయులు కెనడా వంటి దేశాల వైపు ఆకర్షితులవుతున్నట్లు ఇమ్మిగ్రేషన్ విధాన నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.

అమెరికాకు పొరుగునే వున్న కెనడాలో వాతావరణం, సదుపాయాలు , ఉద్యోగావకాశాలు అగ్రరాజ్యం మాదిరిగానే వుంటాయి.దీనికి తోడు కెనడాలో ఇప్పటికే లక్షలాది మంది భారతీయులు స్థిరపడ్డారు.మరింత మందిని ఆకర్షించే లక్ష్యంతోనే కెనడా కొత్త ఇమ్మిగ్రేషన్ విధానానికి తెరదీసింది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఇది రాబోయే రోజుల్లో అమెరికాకు చేటు చేస్తుందని నిపుణులు అంటున్నారు.మరి కెనడా ఎత్తుగడను అగ్రరాజ్యం ఎలా చిత్తు చేస్తుందో వేచి చూడాలి.

Advertisement

మొత్తానికి కెనడా కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం కారణంగా భారతీయులకు లబ్ధి చేకూరనుంది.

తాజా వార్తలు