చేపలు తిన్న తర్వాత పాలు త్రాగితే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందా..

ప్రతి సంస్కృతిలోనూ ఆహార పదార్థాల విషయంలో కొన్ని అపోహలు నమ్మకాలు ఉంటాయి.వీటిని నిజమని చాలామంది నమ్ముతుంటారు.

ఇటీవల కాలంలో కొత్త కొత్త చేపల రెసిపీలు వస్తున్నాయి.అయితే చేపల విషయంలో చాలా అపోహలు ప్రజలలో ఉన్నాయి.

అలాంటి వాటిలో చేపలు తిన్నాక పాలు తాగకూడదు అనేది కూడా ఒకటి.ఒకవేళ చేపల్లో తిన్న వెంటనే పాలు తాగితే చర్మంపై తెల్ల మచ్చలు లేదా కంటి జబ్బులు కూడా వస్తాయని కొన్ని ప్రాంతాలలో నమ్ముతున్నారు.

అయితే ఈ వాదనలో అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఇలా తినడం వల్ల ఏమీ జరగదని అదంతా అపోహ అని డేర్మటాలజిస్ట్ డాక్టర్ ఊర్మిళా జాదవ్ బిబిసి తో చెప్పారు.చర్మంపై మచ్చలకు పాలు లేదా చేపలకు ఎలాంటి సంబంధం లేదు.అదొక ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటే రోగా నిరోధక రుగ్మత మెలానిన్ పై పోరాడే యాంటీ బాడీలను రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేయడం వల్ల ఆ సమస్య వస్తుంది అని ఆమె వెల్లడించారు.

ఎక్కడెక్కడ యాంటీ బాడీ లు దాడి చేస్తాయో అక్కడ చర్మంపై మచ్చలు కనిపిస్తాయి అని వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే అసలు చేపలు పాలు కలిపి తీసుకున్న చర్మంపై మచ్చలు లాంటివి రావు అని ఆమె చెబుతున్నారు.నిజానికి ఇలాంటి అపోహలు చేపలు పాలకు మాత్రమే పరిమితం కావు.ఇతర ఆహార పదార్థాల విషయంలోనూ ఇలాంటి అపోహలు చాలానే ఉన్నాయి.

ఒకసారి వేడి చల్లని పదార్థాలు తింటే ప్రాణాలు పోతాయని కూడా కొందరు చెబుతూ ఉంటారు.ఎప్పుడైనా ఆహారం చల్లగా ఉందా వేడిగా ఉందా అనేదానికంటే మీరు ఏ పరిమాణంలో దాన్ని తీసుకుంటున్నారు అనేది ముఖ్యం.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

మీరు ఏదైనా విపరీతంగా తింటే మీ జీర్ణ వ్యవస్థపై అదీ ప్రభావం చూపే అవకాశం ఉంది.విపరీతంగా తినడంతో పాటు కొన్ని ఆహార పదార్థాల వల్ల కొంత మంది లో అలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది.

Advertisement

మరి కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు అలర్జీని కలిగించే అవకాశం ఉంది.అందుకోసం అలాంటివారు వారికి అలర్జీ కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిది.

తాజా వార్తలు