డయాబెటిస్ ఉన్నవారు తేనె ను ఉపయోగించవచ్చా..?!

సహజ సిద్దమైన తేనే తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది.తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.

స్వచ్ఛమైన తేనెలో ఎంజైములు ఎక్కువగా ఉండడంతో పాటు విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి.శరీరా వ్యవస్థను హానికరమైన బ్యాక్టీరియా నుండి రక్షించడంలో తేనే ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

గుండెజబ్బులు కలవారు తేనెని వాడటం వల్ల‌ గుండె రక్షణకు ఉపయోగపడుతుంది.అయితే షుగర్ పేషేంట్స్ తేనే తీసుకోవచ్చా.

తినే తీసుకుంటే ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దామా.డయాబెటిస్ ఉన్నవాళ్లు పంచదార బదులు తేనె వాడడం వల్ల వచ్చే లాభం పెద్దగా ఏం లేదు.

Advertisement

బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెండూ ఎఫెక్ట్ చేస్తాయి.అయితే, పంచదార కంటే తేనె ఎక్కువ తియ్యగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తేనె కలిపితే సరిపోతుంది కాబట్టి లోపలికి వెళ్ళే షుగ్ర్ కంటెంట్ కొద్దిగా తగ్గుతుంది.

అలాగే, తేనెకి పంచదార అంత రిఫైండ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి అది పంచదార కంటే కొంచెం మంచిదే.అయినా కూడా, డయాబెటిక్ పేషెంట్స్ కి మాత్రం ఇది రికమెండ్ చేయలేరు.

తేనె కీ పంచదార కీ న్యూట్రిటివ్ ప్రొఫైల్ ఒక్కటే.అయితే, తేనెలో కొంచెం మినరల్స్ ఎక్కువ గా ఉంటాయి.

ఇక ఫిట్నెస్ మీద దృష్టి పెట్టేవాళ్ళకి బావుంటుంది కానీ, డయాబెటిక్స్ మాత్రం తేనె నుండి కూడా దూరంగా ఉండాల్సిందే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.బ్లడ్ షుగర్ ఉండడమే మంచిది కాదంటే, అందులో ఫ్లక్చుయేషన్స్ ఉండడం ఇంకా మంచిది కాదు.ఫ్లక్చుయేషన్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ యొక్క హెల్త్ పాడవుతుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

అసలు తేనె తీసుకోవచ్చా, తీసుకుంటే ఎంత తీసుకోవచ్చు అని డయాబెటిక్ పేషెంట్స్ వారి డాక్టర్ ని కన్సల్ట్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోవాలిని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు