ఇదో షాకింగ్ సమాచారం.తమ తరఫున ప్రచారం చేసేందుకు జగన్‌ను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో కీలకమైన తమిళనాడు రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది.
ఇక్కడ అధికార అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ పెద్దలు పొత్తు పెట్టుకున్నారు.దాదాపు 25 నియోజకవర్గాల్లో పార్టీ సీట్లు పంచుకుని ప్రచారానికి దిగుతున్నారు.
ఇక్కడ తిరిగి అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకురావడం తాము కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం ద్వారా దక్షిణాదిన పార్టీని బలోపేతం చేసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే ప్రచారానికి సంబందించిన రూట్ మ్యాప్ను రెడీ చేసుకున్నారు.
అయితే.తమిళనాడు బోర్డర్ జిల్లాల్లో ఏపీ ప్రభావం ఎక్కువగా ఉంది.
అందునా.సీఎం జగన్‌కు తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలతో పాటు కొన్ని వర్గాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.
కానీ వీరంతా ఎక్కువుగా అక్కడ డీఎంకేలో ఉన్నారు.అయితే.వర్గం ఏదైనా.జగన్ కనుక ప్రచారం చేస్తే.తమకు లాభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.ఏపీలో బలమైన చంద్రబాబును గద్దె దించడంలో ఆయన బాగా శ్రమించారు.
ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో జగన్ తనదైన శైలిలో దూసుకుపోయారు.

ఈ నేపథ్యంలోనే ఏపీలో బలమైన పక్షంగా వైసీపీ అవతరించింది.ఈ విషయంలో నిశితంగా గమనించిన బీజేపీ పెద్దలు.జగన్‌ను తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకునేందుకు పరిశీలిస్తున్నారు.
అవసరమైతే.జగన్ కోరుతున్న ప్రత్యేక హోదాను వేరే మార్గంలో ఇచ్చేందుకు కూడా ఆలోచన చేస్తున్నారని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం.
అయితే.తమిళనాడులో మాత్రం తమకు అనుకూలంగా ప్రచారం చేయాలని వారు షరతు పెడుతున్నారు.
ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలోనే జగన్‌కు హుటాహుటిన ఢిల్లీకి రావాలంటూ.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది.బుధవారం మధ్యాహ్నం.జగన్ డిల్లీ వెళ్తున్నారు.ఈ భేటీలో తమిళనాడు ప్రచార అంశమే ఫుల్ అజెండా అని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందడం గమనార్హం.మరి జగన్ అంగీకరిస్తారా? లేదా? చూడాలి.