సౌదీ అరేబియాలో దారుణం జరిగింది.సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ నర్సులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.ఈ దారుణ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో జరిగింది.నర్సులు తమ క్వారంటైన్ పీరియడ్‌ను ముగించుకుని జెడ్డా నుంచి రియాద్‌కు తిరిగి వస్తున్న క్రమంలో సౌదీలోని తైఫ్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.పూర్తి వివారాల్లోకి వెళ్లితే…
ఎన్నో ఆశలతో.
మరెన్నో ఆశయాలతో.జీవితంలో స్దిరపడాలి అని దేశం కాని దేశం వెళ్లిన ఇద్దరు భారతీయుల మహిళల కలలు చెల్లచెదురైయాయి.
అనుకొని .ఊహించని ఘటన తో వాళ్ల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి.తమ కుటుంబాలకి చెదోడుగా నిలుస్తామని .సౌదీ వెళ్లిన ఇద్దరు భారతీయ మహిళలు శవాలుగా కనిపించారు.కేరళకు చెందిన అఖిల(29), సుబి(33) అనే ఇద్దరు మహిళలు సౌదీలో నర్సులుగా పనిచేస్తున్నారు.ఈ క్రమంలోనే నర్సులు తమ క్వారంటైన్ పీరియడ్‌ను ముగించుకుని జెడ్డా నుంచి రియాద్‌కు మినీ బస్సుల్లో తిరిగి వస్తున్న క్రమంలో బస్సు రోడ్డు మీద నుంచి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
దీంతో ఇద్దరు భారతీయ నర్సులు అక్కడికక్కడే మృతిచెందారు.ఈ వార్త వారి కుటుంబాలను విషాదంలోకి నెట్టాయి.

అయితే, ప్రమాద సమయంలో అఖిల, సుబితో పాటు మరో ఇద్దరు భారతీయ నర్సులు కూడా అదే బస్సుల్లో ఉన్నారు.బస్సు రోడ్డు మీద నుంచి స్పీడ్ గా పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లడంతో.వాళ్లకి స్వల్ప గాయాలు అయ్యాయి.దీంతో వాళ్లని చికిత్స కోసం స్దానిక ఆస్పత్రి కి తరలించి చికిత్స చేయిస్తున్నారు అధికారులు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తు, అతివేగంగా వాహనం నడపటమేనని పోలీసులు తెలిపారు.