47 ఏళ్ల తరువాత కలుసుకున్న అక్కాచెల్లెళ్ళు

మన పాత సినిమాలలో కొన్ని కథలు చూస్తూ ఉంటాం.

చిన్నప్పుడు విడిపోయిన అన్నదమ్ములు మళ్ళీ పాతికేళ్ళ తర్వాత కలుసుకోవడం తమ కుటుంబం విడిపోవడానికి కారణం అయిన విలన్ మీద పగ తీర్చుకోవడం.

ఇలాంటి కథలని నిజ జీవిత కథల స్ఫూర్తితోనే రచయితలు రాసుకుంటారు అని కొన్ని సంఘటలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది.కంబోడియా దేశంలో 47 ఏళ్ల తర్వాత అక్కాచెల్లెళ్లు ఒకరిని ఒకరు కలుసుకొని గుర్తు పట్టుకున్నారు.98 ఏళ్ల బన్ సెన్ తన 101 ఏళ్ల అక్క బన్ చియా, 92 ఏళ్ల తమ్ముడిని కలుసుకుంది.ఒకరికి ఒకరు చనిపోయారని భావించి వారంతా చిల్డ్రన్స్ ఫౌండ్ అనే స్వచ్చంద సంస్థ ద్వారా కలుసుకున్నారు.

కంబోడియాలో పోల్ టాప్ నేతృత్వంలోని ఖమెర్ రూజ్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత 1975-79 మధ్య కాలంలో 20 లక్షల మంది ప్రజలు కిరాతకంగా హత్యచేయబడ్డారు.పోల్‌టాప్ పాలనా కాలంలో బన్ సెన్ తన భర్తను కోల్పోయింది.

తరువాత చెత్తను సేకరించి, దానిని అమ్ముకుంటూ పొట్ట పోషించుకుంటూ వచ్చింది.దీనితోపాటు చుట్టుపక్కలున్న పేద పిల్లలకు సాయం అందిస్తూ వచ్చింది.

Advertisement

స్వచ్చంద సంస్థ సాయంతో బన్ సెన్ తన అక్క తమ్ముడుని కలుసుకున్న సందర్భంగా మాట్లాడుతూ చాలాకాలం క్రితమే గ్రామాన్ని విడిచిపెట్టేశానని, తరువాత ఎప్పుడూ గ్రామానికి వెళ్లలేదని తెలిపింది.తన అక్క, తమ్ముడు ఎప్పుడో చనిపోయి ఉంటారని భావించాను.

అయితే ఇప్పుడు వీరిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.అని చెప్పుకొచ్చింది.

నిజంగా ఇలా కలుసుకోవడం వలన ఈ వయసులో తమ జీవితంలో వెలుగు వచ్చిందని చెప్పింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు